మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. మెగా ప్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఆచార్య మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. వచ్చే ఏడాది 2022 ఫిబ్రవరి 4న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు హీరో రామ్ చరణ్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరుకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది.ఈ చిత్రంలో చిరు, చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా కనిపిస్తారు. ఆయన ప్రియురాలిగా పూజా హెగ్డే కనిపించబోతోంది. ఈ…
మెగాభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ రాకకు ముహూర్తం ఖరారైంది. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీపై ఇప్పటికే పలు వార్తలు ప్రచారం లో ఉన్నాయి. ముందుగా దసరాకి వస్తుందని వినిపించినా ఆ తర్వాత వచ్చే సంక్రాంతికి రానుందంటూ సోషల్ మీడియా కోడై కూసింది. కానీ ఇప్పుడు వాటానికి తెర పడింది. తాజాగా ఈ చిత్రబృందం తాజాగా విడుదల తేదీ ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన విడుదల…
‘పెళ్లి సందD’ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా కనిపించబోతున్నాడు. రోషన్ కు జంటగా శ్రీలీల నటిస్తోంది. అయితే ఈ చిత్రానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం లేదు. కేవలం దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాతో రాఘవేంద్రరావు శిష్యురాలు అయిన గౌరి రోనక్ కొత్త దర్శకురాలిగా పరిచయం కాబోతుంది. ఇక శ్రీకాంత్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాకు…
మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న “కొండపొలం” చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమా గురించి ట్వీట్ చేశారు. నిన్న ఈ సినిమా ప్రత్యేక ప్రివ్యూను ప్రదర్శించగా చిత్రబృందంతో కలిసి మెగాస్టార్ వీక్షించారట. “ఇప్పుడే ‘కొండపొలం’ చూశాను. ఒక శక్తివంతమైన సందేశంతో కూడిన అందమైన గ్రామీణ ప్రేమ కథ. క్రిష్ ఎప్పుడూ విభిన్న కళా నైపుణ్యాలను, సంబంధిత సమస్యలను ఎంచుకుని,…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఇంటరెస్టింగ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప”. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ‘పుష్ప’రాజ్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఈ డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అప్పటి నుంచి పుష్పరాజ్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఓ స్టార్ హీరో కోసం…
తెలంగాణ వాసులు ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ‘బతుకమ్మ’ సంబరాలు మొదలయ్యాయి. ఈ తొమ్మిది రోజులూ సాయంత్రం కాగానే అందమైన పూలతో తయారు చేసిన ‘బతుకమ్మ’ను మధ్యలో పెట్టి చుట్టూ చేరి మహిళలంతా ఆటపాటలతో సందడి చేస్తారు. 9 రోజులపాటు రోజుకో రకమైన నైవేద్యం సమర్పిస్తూ రోజుకో పేరుతో బతుకమ్మను సెలెబ్రేట్ చేసుకుంటారు. అందులో ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ,…
మా ఎన్నికల ప్రచారం పోటాపోటీగా నడుస్తోంది. రెండు ప్యానల్స్ సభ్యులు విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే మెగాహీరోలు ఎవరు పోటీ చేసి ఉన్నా తన కుమారుడు మంచు విష్ణును పోటీనుంచి తప్పించి ఏకగ్రీవం చేసి ఉండేవాడినని మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చారు. చిరంజీవితో తన స్నేహం ఎల్లప్పుడూ చెక్కుచెదరకుండా ఉంటుందని, పోటీ నుండి విష్ణుని ఉపసంహరించుకోమని చిరంజీవి తనను అడిగాడని వస్తున్న పుకార్లను ధృవీకరించలేనని అంటున్నారు మోహన్ బాబు. ఒకవేళ చిరంజీవి కుమారుడు…
(అక్టోబర్ 4న ‘డాడీ’కి ఇరవై ఏళ్ళు పూర్తి) మెగాస్టార్ చిరంజీవికి 2001వ సంవత్సరం నిరాశ కలిగించిందనే చెప్పాలి. ఆ యేడాది ఆయన నటించిన ‘మృగరాజు’ చేదు అనుభవాన్ని మిగల్చగా, ‘శ్రీమంజునాథ’ కూడా ఆశించిన స్థాయిలో అలరించలేదు. అయితే ‘డాడీ’ చిత్రం మాత్రం నటునిగా ఆయనకు మంచి మార్కులు సంపాదించి పెట్టింది. ఈ చిత్రంలోనే అల్లు అర్జున్ తొలిసారి తెరపై నర్తిస్తూ కనిపించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ‘డాడీ’ చిత్రానికి సురేశ్ కృష్ణ దర్శకత్వం…
మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘లూసిఫర్’ చిత్రాన్ని తెలుగులో ‘గాడ్ ఫాదర్’ గా రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ సెట్స్ మీదకు రానున్న నేపథ్యంలో తాజాగా చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ ను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ షేర్ చేశారు. ‘గాడ్ ఫాదర్’ మ్యూజిక్ సెషన్ ను తమన్ ఇదివరకే ప్రారంభించగా, తదుపరి ట్యూన్ అంశాలపై చర్చించారు. తాజాగా…
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తోన్న జనసేన.. ఇవాళ శ్రమదానానికి పిలుపునిచ్చింది.. ఇప్పటికే రాజమండ్రి చేరుకున్నారు జనసేన చీఫ్.. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. అసలు, పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ కోసం ఆంధ్ర వచ్చినప్పుడు రాజకీయాలు గుర్తుకువస్తాయంటూ ఎద్దేవా చేశారు.. గతంలో…