ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వివాదానికి తెర దించేందుకు రంగంలోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి.. సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు.. సీఎం జగన్ ఆహ్వానం మేరకే ఆయనను కలిసినట్టు.. చాలా మంచి వాతావరణంలో సమావేశం జరిగింది.. సమస్యలు అన్నీ సమసిపోతాయనే నమ్మకాన్ని కూడా వ్యక్తం చేశారు చిరంజీవి.. ఇదే సమయంలో.. ఇది ఇద్దరి భేటీయే కావడంతో రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి.. ఇక, ఈ భేటీపై తనదైన శైలిలో స్పందించారు సీపీఐ జాతీయ నేత నారాయణ.. చిరంజీవి, సీఎం జగన్ భేటీ మీద ఊహాగానాలు తలెత్తడం సహజమే అన్నారు.. చిరంజీవి సోషల్ మీడియా వేదికగా “తాను రాజ్యసభ సీటు ఆశించి ముఖ్యమంత్రిని కలవలేదని, తనకి అలాంటి ఆలోచన లేనేలేదని”, అయితే కొంతమంది ఇలా ఇష్టానుసారంగా తమ భేటీ మీద వ్యాఖ్యలు చేయడం, తనకు భాధ కలిగించిందని పేర్కొనడం హాస్యాస్పదం అన్నారు.
Read Also: వైరల్: వీడేరా పోలీస్… సూపర్ ఛేజింగ్…
ఇది సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్య కాబట్టి.. దానికి సంబంధిత అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లని తీసుకురాకుండా, వ్యక్తిగత భేటీలాగా ప్రత్యేక విమానంలో ఆఘమేఘాల మీద వచ్చి, విందు ఆరగించి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని మీడియాకి తెలియజేయడం చూస్తుంటే ఎవరికైనా ఊహాగానాలు రావడం సహజమే అన్నారు నారాయణ.. వాస్తవానికి చిరంజీవి తనకి మంచి మిత్రుడని, అయితే ఈ ఊహాగానాలకు తెరలేపింది చిరంజీవియే అన్నారు.. ఎందుకంటే వన్ టు వన్ భేటీ అన్నప్పుడు లోపల చిరంజీవి, ముఖ్యమంత్రి ఇద్దరూ రాజ్యసభ సీటు గురించి మాట్లాడుకున్నారో లేక వేరే ఎదైనా వ్యక్తిగత లబ్ధి కోసం కలిసారో అనే ఊహాగానాలు రావడం సహజమే అన్నారు.. అయితే, ఆ ఊహాగానాలకు తెరపడాలి అంటే, చిత్ర పరిశ్రమ మొత్తాని తీసుకువచ్చి ప్రభుత్వంతో చర్చలు జరపాల్సి ఉంటుందని సూచించారు సీపీఐ నేత నారాయణ.