చిరు, జగన్ భేటీకి నాగార్జున ఎందుకు వెళ్ళలేదు ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సమస్యలకు సంబంధించి సీఎం జగన్ తో భేటీకి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. స్వయంగా సీఎం ఆహ్వానం మేరకే సినిమా బిడ్డగా భేటీకి వచ్చానంటూ చిరంజీవి చెప్పారు. అయితే సీఎం జగన్, చిరంజీవి ఈ లంచ్ భేటీలో అసలేం చర్చించబోతున్నారు ? చాలా రోజులుగా సమస్యలతో సతమతమవుతున్న టాలీవుడ్ కు ఈ భేటీతో ఊరట లభిస్తుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది. కొద్దిసేపటి క్రితం బేగంపేట నుంచి చార్టర్డ్ ఫ్లైట్‌లో విజయవాడకు బయలుదేరిన చిరంజీవి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాక మీడియాకు కన్పించారు. తాజాగా ఏపీ సీఎం జగన్ నివాసానికి చేరుకున్న చిరంజీవి ఈ లంచ్ భేటీలో సినిమా సమస్యలపై, ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ టిక్కెట్ ధర కారణంగా తెలుగు సినిమా ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చర్చించనున్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. అయితే ఈ భేటీకి నాగార్జున ఎందుకు హాజరు కాలేదు ?
Read Also : లైవ్ : ఏపీ సీఎంతో చిరంజీవి భేటీ
Also Read
- Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
- Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
ఇటీవల “బంగార్రాజు” ఈవెంట్ లో తమ సినిమాకు టికెట్ ధరల సమస్య లేదని చెప్పి నాగార్జున విమర్శలకు గురయ్యారు. ఆ తరువాత నాగ చైతన్య కూడా ఇదే విధంగా రియాక్ట్ అయ్యారు. నటులుగా తమకు ఈ విషయం గురించి ఆందోళన లేదని, అది నిర్మాతలు చూసుకుంటారని చెప్పారు. ఇండస్ట్రీ మొత్తం సినిమా టికెట్ ధరల గురించి ఘాటుగా స్పందిస్తుంటే అక్కినేని హీరోలు మాత్రం పర్లేదు అన్నట్టుగా ఉండడం టాలీవుడ్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. ఇదిలా ఉండగా… తాజాగా చిరు, జగన్ భేటీపై నాగార్జున స్పందించారు.
Read Also : ‘రౌడీ బాయ్’తో లిప్ లాక్ పై మీమ్స్… అనుపమ రియాక్షన్
“అందరి కోసమే చిరంజీవి సీఎం దగ్గరికి వెళ్లారు. జగన్ కు చిరంజీవి అంటే ఇష్టం… ఇండస్ట్రీ సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి” అని అన్నారు. ఇక సినిమా టికెట్ల విషయంలో తాను చేసిన కామెంట్స్ గురించి మాట్లాడుతూ ‘టికెట్లపై నా సినిమా వరకే మాట్లాడాను’ అని వివరణ ఇచ్చారు. ఇక ఈ మీటింగ్ తాను ఎందుకు హాజరు కాలేదు అన్న విషయాన్ని కూడా నాగార్జున ఈ సందర్భంగా స్పష్టం చేశారు. “బంగార్రాజు” ఫంక్షన్ ఉండటం వల్ల నాగార్జున అక్కడికి వెళ్లలేకపోయారట. కాగా చిరంజీవి, జగన్ భేటీ తరువాత సినిమా సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తోంది టాలీవుడ్. ప్రస్తుతం వీరి మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!