మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన వచ్చేసింది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య, యువ దర్శకుడు వెంకీ కుడుమలతో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. చిరంజీవికి మెగా ఫ్యాన్ అయిన వెంకీ కుడుమల ఈ అవకాశం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. దానిని సరదాగా ఓ చిన్న వీడియో రూపంలో డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ట్వీట్ చేసింది. ‘ఇలాంటి అవకాశం జీవితంలో ఒకేసారి వస్తుందని, తనపై ఉంచిన…
మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ శరవేగంగా సాగుతోంది. 2017లో ‘ఖైదీ నంబర్ 150’తో 150వ చిత్రం పూర్తి చేసిన చిరంజీవి ఆ తర్వాత ప్రతిష్టాత్మకంగా ‘సైరా’ మూవీ చేశాడు. ఇక 152వ చిత్రం ‘ఆచార్య’ నుండి ఒక్కసారిగా వేగం పెంచాడు. చిరు, చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ వచ్చే యేడాది ఫిబ్రవరిలో జనం ముందుకు రాబోతోంది. ఒకేసారి ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’ చిత్రాలతో పాటు బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ బ్యానర్ లో మరో సినిమాలోనూ…
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మా అధ్యక్షుడు మంచు విష్ణు వైఎస్ఆర్సీపీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి నిశ్చితార్థ వేడుకకు ఆహ్వానం లభించింది. ఈ వేడుకకు హాజరైన చిరు, విష్ణు కాబోయే దంపతులను ఆశీర్వదించారు. చిరంజీవి వేదికపై ప్రజలతో మమేకమవడం చూసి పలువురు మెగాస్టార్‌తో సెల్ఫీలు దిగారు. అలాగే ఈ నిశ్చితార్థ వేడుకకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు వైఎస్సార్సీపీ నేతలు హాజరై వారిని ఆశీర్వదించారు. ఇప్పుడు బొత్స కుమారుడి నిశ్చితార్థానికి చిరంజీవి హాజరైన విజువల్స్…
నిన్న విడుదలైన టాలీవుడ్ మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ పై సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తమ స్పందనను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ట్విట్టర్ వేదికగా ట్రైలర్ పై ఆసక్తికరంగా స్పందించారు. “ట్రైలర్ లోని ప్రతి షాట్ అద్భుతంగా ఉంది. మైండ్ బ్లోయింగ్!! మాస్టర్ స్టోరీ టెల్లర్ తిరిగి వచ్చాడు. ట్రైలర్ అంతా గూస్బంప్స్!!” అంటూ ట్వీట్ చేశారు. మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ఓ భారీ పాన్…
మెగాస్టార్ చిరు వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. ప్రస్తుతం ఆయన మూడు సినిమాలలో నటిస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’, మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘బోళా శంకర్’.. బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీర్రాజు’ .. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాలలో ‘వాల్తేరు వీరయ్య’ స్టోరీ ఇదే అంటూ కొన్ని వార్తలు గుప్పుమంటున్నాయి. మెగా 154 గా మొదలైన ఈ చిత్రం అరాచకం ఆరంభం అంటూ ఫుల్ యాక్షన్ లోకి దింపేశారు. ఇక ఈ చిత్రంలో…
డిసెంబరు 8 బుధవారం తమిళనాడులోని కూనూర్ సమీపంలో జరిగిన చాపర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు మరో 11 మంది సైనికులు మరణించారు. డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌కు దేశం మొత్తం సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తోంది. రావత్ వీరమరణానికి చిత్రసీమ కూడా సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం వ్యక్తం చేసింది. మోహన్‌లాల్, చిరంజీవి, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి దక్షిణాది ప్రముఖులు…
బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా షూటింగ్ మొదలైంది. ఇక ఈ సినిమాలో రవితేజ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడట. గతంలో చిరంజీవితో ‘అన్నయ్య’ సినిమాలో ఆయన తమ్ముడుగా నటించాడు రవితేజ. ఇక రవితేజ ‘డాన్ శ్రీను’కి స్క్రీన్ ప్లే, ‘బలుపు’కి కథ అందించిన కె.యస్. రవీంద్ర అలియాస్ బాబీ రవితేజ ‘పవర్’ సినిమాతోనే దర్శకుడుగా మారాడు. ఇప్పుడు చిరంజీవితోనూ, దర్శకుడు బాబీతోనూ ఉన్న అనుబంధాన్ని పురస్కరించుకుని చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో చిరు సన్నిహితుడి పాత్రలో…
సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో పండగల సమయంలో సినిమాలను విడుదల చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఫిబ్రవరిని ఆఫ్ సీజన్‌గా పరిగణిస్తారు. కానీ కోవిడ్ -19 మహమ్మారి, లాక్డౌన్ కారణంగా ఆన్, ఆఫ్ సీజన్ సెంటిమెంట్లతో సంబంధం లేకుండా పెండింగ్‌లో ఉన్న అన్ని సినిమాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. ఫిబ్రవరి 2022 మొదటి వారంలోనే థియేటర్లు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” ఫిబ్రవరి 4న వస్తుంది. మొదట్లో చిరుకి సోలో రిలీజ్ ఉంటుందని అందరూ…
మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి నివాళులు అర్పించారు. ఉభయ రాష్ట్రాలకు, తెలుగు ప్రజలకు రోశయ్యలేని లోటు తీరనిదని కిషన్ రెడ్డి అన్నారు. 1980లో శాసన మండలి సభ్యుడిగా ఉన్న సమయంలో తాను రెగ్యులర్‌గా శాసనమండలిలో రోశయ్య ప్రసంగాలు వీక్షించే వాడినని తెలిపారు. 2004 నుంచి 2014 వరకు శాసనసభలో కలిసి పనిచేశామని, ప్రతిరోజు రాజకీయంగా ఘర్షణ పడేవాళ్లమని, తాము రాజకీయ శతృవులము కాదని, తమకు రాజకీయ వైరుధ్యము మాత్రమే ఉందని తెలిపారు.…
మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, మాజీ పీసీసీ అధ్యక్షులు కొణిజేటి రోశయ్య అనారోగ్యం కారణంగా ఈరోజు ఉదయం కన్నుమూశారు. రోశయ్య మృతికి 4, 5, 6 తేదీల్లో మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిపిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అజాత శత్రువు కన్నుమూతతో రాజకీయాల్లో ఒక శకం ముగిసింది అంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రొడ్యూసర్…