మెగాస్టార్ చిరంజీవి 42వ మ్యారేజ్ యానివర్సరీ నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా చిరంజీవి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఇటీవల కేవలం ఒక్కరోజులో పలు ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించి వార్తల్లో నిలిచిన మెగాస్టార్ ఇప్పుడు వెకేషన్ కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా హైదరాబాద్ లో సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించి, శబరిమలకి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాడు. అనంతరం గురువాయూర్‌లోని శ్రీకృష్ణుని ఆలయాన్ని సందర్శించారు. ఇప్పుడు ఆయన అతి త్వరలో మాల్దీవులకు వెళ్లి అక్కడ సరదాగా గడుపుతారని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
Read Also : Shaakuntalam : శకుంతల లుక్ కు ముహూర్తం ఖరారు
మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో చిరంజీవి నటిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ ఏప్రిల్ 29న విడుదల కానుంది. మరోవైపు ‘భోళాశంకర్’, ‘గాడ్ ఫాదర్’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి. బ్యాక్-టు-బ్యాక్ షూటింగులలో పాల్గొంటున్న చిరంజీవి ‘ఆచార్య’ గురించి మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Happy Wedding Anniversary Mega star @KChiruTweets garu and #Surekha garu.
— Bobby (@dirbobby) February 20, 2022
Wishing you both many more years of joyous life together. ❤️ ? pic.twitter.com/06O8vzrkSa