పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ ఈ చిత్రం అద్భుతమైన డైలాగ్స్, స్క్రీన్ ప్లే, తారాగణం, మ్యూజిక్ తో కోసం అందరి దృష్టిని ఆకర్షించగలిగింది. అయితే తాజాగా నాగ బాబు ‘భీమ్లా నాయక్’ను ఇబ్బంది పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేస్తూ తన యూట్యూబ్ ఛానెల్‌లో సినిమా సమస్యలు, ప్రస్తుతం పరిస్థితుల గురించి ప్రస్తావించారు. సినిమా ఎలా పని చేస్తుందో, దాని కార్యకలాపాలు ఎలా ఉంటాయో తెలియదని అజ్ఞాని వైఎస్సార్సీపీ అని అన్నారు. గతంలో ఎంత మంది హీరోలు ఉద్దేశపూర్వకంగా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారో లేదా కొంత మందిని వాపసు చేశారనే దానిపై పార్టీ వ్యక్తుల వద్ద ఎటువంటి డేటా లేదని, అత్తారింటికి దారేది సినిమా ఇంటర్నెట్‌లో లీక్ అయినప్పుడు నిర్మాతకు సహాయం చేయడానికి పవన్ తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడని, చిరంజీవి కూడా అంజి కోసం తన రెమ్యూనరేషన్‌ను వదిలేసాడని, మహేష్ బాబు, తారక్, వరుణ్ తేజ్, చరణ్ లు కూడా సినిమా హిట్ అయితే రెమ్యూనరేషన్ పూర్తిగా తీసుకుంటారని వెల్లడించారు.
Read Also : Bheemla Nayak : ట్యాలెంటెడ్ బ్యూటీ డీప్ గా హర్ట్ అయినట్టుందిగా !?
ఇంత జరుగుతున్న పవన్ కళ్యాణ్‌కు మద్దతివ్వడానికి ఏ హీరో, ఏ నిర్మాత ముందుకు రాలేదని, పరిశ్రమలో పెద్దలు ఉన్నప్పటికీ ఒక్కరు కూడా దీనిపై నోరు మెడకపోవడం బాధను కలిగించిందని, ఒకరో ఇద్దరో స్పందించినప్పటికీ పెద్దగా ప్రభావం కనిపించలేదని అన్నారు. అంతగా అయితే కొడాలి నాని లాంటి ఆర్టిస్టులను పెట్టుకుని మీరే సినిమాలు చేయండి. ఇక మీ ప్రభుత్వంలో అంత బాగా నటించే హీరోయిన్లు లేరు. కాస్త కష్టమే అయినా రెమ్యూనరేషన్ పే చేస్తే దొరుకుతారని ఉచిత సలహా ఇచ్చారు. ఇంకా ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఏమిటో నాగబాబు మాటల్లోనే చూడండి.