చైనీయులకు భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గురువారం నుంచి టూరిస్ట్ వీసాలు ఇవ్వనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. 2020లో సరిహద్దు ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య బంధాలు తెగాయి. తాజాగా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇటీవల చైనాలో పర్యటించారు.
4,500 టన్నుల హైటెక్ చైనీస్ పరిశోధన నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. తిలాఫుషీ తీరంలో ఇది లంగరేసింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత తిరిగి మాల్దీవుల జలాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
పాకిస్థాన్ క్షిపణి వ్యవస్థకు అగ్రరాజ్యం అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాల కోసం సాంకేతిక వస్తువులను సరఫరా చేసే చైనా, బెలారస్ కంపెనీలను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నిషేధించింది.
భారతీయులకు మలేషియా ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారతీయులు ఇప్పటికే థాయ్‌లాండ్, శ్రీలంకలో వీసా ఫ్రీ ఎంట్రీని పొందుతున్నారు. ఇక నుంచి మలేషియాలో వెళ్లేందుకు వీసా అవసరం లేదని ఆ దేశ ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ప్రకటన చేశారు.
Mother Sues Son: ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యతు ఉన్నతంగా ఉండాలని చాలా కష్టపడుతారు. అప్పు చేసైనా మంచి చదువులు చెప్పించాలని అనుకుంటారు. అదే కుటుంబ పెద్ద లేని కుటుంబం అయితే ఈ పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంటుంది.
ఉత్తరాఖండ్ కు చెందిన 46 ఏళ్ల దేవ్ రాటూరి జీవిత చరిత్రను చైనా స్కూల్ పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చడం గమనార్హం. హోటల్లో వెయిటర్ నుంచి చైనాలో మోస్ట్ పాపులర్ నటుడిగా దేవ్ రాటూరి ఎదిగాడు.
యూఎస్ వ్యవస్థలకు వ్యతిరేకంగా పని చేస్తున్న వాటిని గుర్తించి హెచ్చరికలను జారీ చేస్తుంది. అమెరికాకు ప్రమాదం పొంచి ఉంటే సకాలంలో ముప్పును గుర్తించడంతో పాటు దాన్ని ట్రాక్ చేయడం వంటి సామర్థ్యాన్ని ఈ ఆర్బిటర్ కలిగి ఉంది అని స్పేస్ ఫోర్స్ విశ్లేషకులు తెలిపారు.
Omicron BF7: కోవిద్ చైనాలో విజృంభిస్తుండడంతో నివారణ మందుల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ముఖ్యంగా భారత్ నుంచి అనధికారికంగా వచ్చే డ్రగ్స్ కొనేందుకు బ్లాక్ మార్కెట్ ను ఆశ్రయిస్తున్నారు.