Omicron BF7: కోవిద్ చైనాలో విజృంభిస్తుండడంతో నివారణ మందుల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ముఖ్యంగా భారత్ నుంచి అనధికారికంగా వచ్చే డ్రగ్స్ కొనేందుకు బ్లాక్ మార్కెట్ ను ఆశ్రయిస్తున్నారు. ఈ భారతీయ మందులకు చైనా ప్రభుత్వం నుంచి అనుమతిలేదు. అయినా వీటిని అక్కడ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు అక్రమ వ్యాపారులు. వీటిన కనుక ప్రభుత్వం గుర్తిస్తే శిక్షలు విధించడం ఖాయం. భారత్‌కు చెందిన నాలుగు రకాల జెనరిక్ యాంటీ కోవిడ్ మందులు చైనాలో చట్టవిరుద్ధంగా అమ్ముడవుతున్నాయి. ప్రిమోవిర్, పాక్సిస్టా, మోల్నునాట్, మోల్నాట్రిస్ వంటి బ్రాండ్ల జెనరిక్ కోవిడ్ మందుల బాక్స్‌లను వెయ్యి యువాన్లకు బ్లాక్‌మార్కెట్‌లో కొంటున్నారు. చైనా సోషల్ మీడియా వీబోలో ఈ విషయం తెగ వైరల్ అవుతున్నది.
Read Also : Zomoto Biryani : ఏంటి సామి ఇది.. ఎంత ఇష్టమైతే ఏడాదిలో ఇన్ని బిర్యానీలా..
చైనా మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం, ప్ఫైజర్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న పాక్స్‌లోవిడ్, చైనా కంపెనీ జెన్యూన్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న హెచ్ఐవీ డ్రగ్ అజ్వుడైన్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ రెండు కోవిడ్-19 యాంటీవైరల్స్ కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అనూహ్యంగా విజృంభించిన కోవిడ్ నుంచి బయటపడేందుకు ప్రజలు బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నారు. చట్టవిరుద్ధమైన ఔషధాలను కొనవద్దని చైనా ప్రజారోగ్య శాఖాధికారులు, వైద్యులు గతంలో ప్రజలను హెచ్చరించారు. ఇండియన్ ఫార్మాస్యుటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ సాహిల్ ముంజల్ ఇటీవల ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఇబుప్రోఫెన్, పారాసిటమాల్ కోసం భారతీయ ఔషధాల తయారీదారులను అడుగుతున్నారని చెప్పారు. ఫీవర్ మెడిసిన్స్‌ను చైనాకు ఎగుమతి చేసేందుకు మన దేశంలో ఉత్పత్తిని పెంచుతున్నట్లు తెలిపారు.