అమెరికా బాటలోనే మెక్సికో వెళ్తోంది. ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాల పెంపుతో వాణిజ్య యుద్ధానికి తెర లేపారు. దీంతో మిత్ర దేశాలు కూడా శత్రు దేశాలుగా మారిపోయాయి. ఇప్పుడు అదే బాటలో మెక్సికో వెళ్తోంది. భారతదేశం, చైనా, దక్షిణ కొరియా నుంచి వచ్చే దిగుమతులపై ఏకంగా 50 శాతం సుంకాలు విధించింది. 5 నుంచి 50 శాతం మధ్య సుంకాలు విధించే బిల్లుకు మెక్సికో సెనేట్ అనుకూలంగా ఓటు వేసింది. అనుకూలంగా 76 ఓట్లు, వ్యతిరేకంగా 5 ఓట్లు పడ్డాయి. 35 మంది గైర్హాజరుతో బిల్లు ఆమోదం పొందింది. దీంతో దక్షిణాసియా దేశాలపై వాణిజ్య యుద్ధం ప్రకటించినట్లైంది.
ఇది కూడా చదవండి: Machado: నెలల తర్వాత పబ్లిక్‌గా కనిపించిన నోబెల్ శాంతి గ్రహీత మచాడో
కొత్త సుంకాలు వచ్చే ఏడాది నుంచే అమల్లోకి రానున్నాయి. దుస్తుల నుంచి లోహాలు, ఆటో విడిభాగాలు వరకు అనేక ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపించనుంది. ఇక చైనా నుంచి కర్మాగారాల నుంచి ఉత్పత్తి అయ్యే వాటిపై కూడా ఎక్కువ ప్రభావం చూపించనుంది. ఒకప్పుడు మెక్సికో ఇతర దేశాలతో మంచి సంబంధాలే కొనసాగించింది. ఇప్పుడు వ్యతిరేక దిశలో పయనిస్తోంది. కొత్త సుంకాల కారణంగా వచ్చే ఏడాది దాదాపు 2.8 బిలియన్ల అదనపు ఆదాయం పెరుగుతుందని మెక్సికో ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.
ఇది కూడా చదవండి: Erika kirk: చార్లీ కిర్క్ హత్యపై స్నేహితురాలు సంచలన ఆరోపణలు.. ఎరికా కిర్క్ తీవ్ర ఆగ్రహం
