China Sending Military aircrafts, warships near to Taiwan :
తైవాన్ విషయంలో డ్రాగన్ కంట్రీ మరోసారి రెచ్చిపోతుంది. తైవాన్ విషయంలో కయ్యానికి కాలు దువ్వుతుంది. దీని కారణంగా ఆ రెండు ప్రాంతాల్లో యుద్దవాతావరణం నెలకొన్నట్లు కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని విషయాలను తైవాన్ తెలిపింది. గడిచిన 24 గంటల్లో తైవాన్ భూభాగంలోకి చైనాకు చెందిన యుద్ద విమానాలు, యుద్ద నౌకలు ప్రవేశించాయని పేర్కొంది. 22 సైనిక యుద్ధ విమానాలు, 20 యుద్ధ నౌకలు తమ భూభాగంలోకి ప్రవేశించాయని అందులో 13 యుద్ధ విమానాలు తైవాన్, చైనా మధ్య సరిహద్దు రేఖను కూడా దాటినట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే డ్రాగన్ కంట్రీకి కోపం రావడం వల్లే ఇలా జరిగినట్లు అర్థం అవుతుంది.
Also Read: VAC Mode Signaling: ఇక నో వెయిటింగ్.. గ్రేటర్‌లో వీఏసీ మోడ్ సిగ్నలింగ్ వ్యవస్థ
ఎందుకంటే గత వారాంతంలో అమెరికా, కెనడాలకు చెందిన యుద్ధనౌకలు తైవాన్ జలసంధిలో ప్రయాణించాయి. చైనా వీటిని రెచ్చగొట్టే చర్యలుగా పేర్కొనగా అమెరికా మాత్రం’నావిగేషన్ స్వేచ్ఛ’ ప్రయత్నాలలో భాగమని చెప్పుకొచ్చింది. దీని కారణంగా డ్రాగన్ కంట్రీ సోమవారం తన యుద్ధనౌకలను తైవాన్ జలాల్లోకి పంపించింది. విమానవాహక నౌక షాండోంగ్ నేతృత్వంలో ఈ యుద్ధనౌకలు 110 కి.మీ. ప్రయాణించి ఆగ్నేయ తైవాన్ చేరుకున్నాయి. దీనికి సంబంధించి కూడా చైనా కేవలం ఇవి యుద్ద విన్యాసాల కోసం తైవాన్ కు దగ్గర ప్రాంతాలకు తెచ్చినట్టు చెబుతుంది. ఇక్కడ యుద్ధవిమానాలు, జలాంతర్గాముల సన్నద్ధత పరీక్షిస్తామని తెలిపింది. తైవాన్ కు 70 మైళ్ల దూరంలో విమానవాహక నౌక షాన్ డాంగ్ నేతృత్వంలో చైనా నౌకా దళాన్ని మొహరించిందన్న విషయాన్ని తైవాన్ కూడా పేర్కొంది. ఇక ఎన్నో ఏళ్ల నుంచి చైనా తైవాన్ మధ్య విబేధాలు ఉన్న విషయం తెలిసిందే. ఎన్నో శతాబ్ధాలుగా వీటి మధ్య గొడవలు ఉన్నాయి. ఇక వీటిని అదునుగా తీసుకున్న అగ్రరాజ్యం అమెరికా తైవాన్ పేరుతో డ్రాగన్ ఆటలు కట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇది మింగుడుపడని చైనా.. అమెరికా యుద్ద నౌకలు రాగానే తమ నౌకలను కూడా మొహరించింది.