Maldives: మాల్దీవుల్లో కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు వచ్చిన తర్వాత నుంచి భారత్ వ్యతిరేఖ, చైనా అనుకూల ధోరణిని అవలంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి మంత్రులు భారత ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవ్స్‌కి పర్యాటకంగా ఎక్కువ వెళ్లే భారతీయులు వారి టూర్లను క్యాన్సిల్ చేసుకున్నారు. ‘‘బాయ్‌కాట్ మాల్దీవులు’’ హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు. ఈ వివాదంతో మాల్దీవ్స్ పర్యాటక ఇండస్ట్రీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
Maldives: చైనా అనుకూలంగా వ్యవహరించే మహ్మద్ ముయిజ్జూ మాల్దీవుల అధ్యక్షుడు అయినప్పటి నుంచి భారత్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనపై అక్కడి మంత్రులు అవాకులు చెవాకులు పేలి తన పదవులను ఊడగొట్టుకున్నారు. భారత టూరిస్టులు మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకుని ఆ దేశానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చారు. మరోవైపు ‘భారత్ అవుట్’ అనే విధానంతో తాను అధ్యక్షుడు కాగానే మాల్దీవుల్లో ఉన్న భారత్ సైనికులను వెళ్లగొడతానని ముయిజ్జూ చెప్పాడు. అందుకు అనుగుణంగానే పావలు…
కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకున్నట్టు ఆ దేశ విదేశీ వ్యవహారాల నిఘా సంస్థ కెనేడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ సంచలన ఆరోపణలు చేసింది. భారత్‌తో ముప్పు పొంచి ఉందని కూడా హెచ్చరికలు జారీ చేసింది.
భారత్ పొరుగు దేశాలపై చైనా ప్రభావం చూపుతుందని, ఇలాంటి పోటీ రాజకీయాలకు భారత్ భయపడాల్సిన అవసరం లేదని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మంగళవారం అన్నారు. ప్రతి పరిసరాల్లో సమస్యలు ఉన్నాయని, కానీ చివరికి పొరుగువారికి ఒకరికొకరు అవసరమని.. ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో విద్యార్థులతో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో మాల్దీవులతో ఉన్న సంబంధాల గురించి అడిగినప్పుడు ఆయన ఈ విషయం చెప్పారు.
డ్రాగన్ కంట్రీ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ (MDP) రెడీ అవుతుంది.
భారత్‌తో సరిహద్దు వివాదంపై డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. ద్వైపాక్షిక సంబంధాలను సరిహద్దు వివాదంతో ముడిపెట్టడం సరికాదని వెల్లడించింది. డ్రాగన్ కంట్రీ చర్యల ఫలితంగానే తూర్పు లద్ధాఖ్లోని గల్వాన్ లోయలో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది.
China: చైనాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 39 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరో 9 మంది గాయాలపాలయ్యారు. తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్సులోని జిన్యు నగరంలో బుధవారం ఈ దుర్ఘటన జరిగింది. ఒక భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
Stock Market : భారత స్టాక్ మార్కెట్ తొలిసారిగా హాంకాంగ్‌ను వెనక్కి నెట్టింది. భారతీయ ఎక్స్ఛేంజీలలో జాబితా చేయబడిన స్టాక్‌ల సంయుక్త విలువ సోమవారం 4.33 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.
Chinese Share Market: చైనా స్టాక్ మార్కెట్లో భారీ అమ్మకాల కాలం ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఈ ట్రెండ్ ఈ ఏడాది కూడా ఉపశమనం కలిగించే సూచనలు కనిపించడం లేదు.