China: చైనా-భారత్ సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ బోర్డర్‌లో మరింత మంది సైన్యాన్ని మోహరించింది. అయితే, ఈ పరిణామాలు డ్రాగన్ కంట్రీ చైనాకు మింగుడు పడటం లేదు. వివాదాస్పద సరిహద్దుల్లో భారత్ మరిన్ని బలగాలను మోహరించడం ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఉపయోగపడేది కాదని చైనా విశ్వసిస్తోదని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి శుక్రవారం అన్నారు. చైనాతో వివాదాస్పద సరిహద్దులను మరింత బలోపేతం చేసేందుకు 10,000 మంది సైన్యాన్ని మోహరించింది.
రెండు దేశాలు గతంలో సైనిక, దౌత్య మార్గాల ద్వారా చర్చలు నిర్వహించడానికి అంగీకరించాయి. ఇరు దేశాలు మధ్య పలుమార్లు సైనిక చర్చలు జరిగాయి. అయినా పెద్దగా ఫలితం కనిపించలేదు. హిమాలయాలకు సరిహద్దుగా ఉన్న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు చైనాతో 532 కి.మీ సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ పశ్చిమ సరిహద్దు వద్ద 10 వేల మంది సైనికులను భారత్ మోహరించినట్లు భారత మీడియా తెలిపింది.
Read Also: Sajjala: బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారు
సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతను కాపాడేందుకు భారత్‌తో కలిసి పనిచేయడానికి చైనా కట్టుబడి ఉందని చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. భారత ప్రవర్తన శాంతిని కాపాడటానికి అనుకూలంగా లేదని, ఉద్రిక్తతలను తగ్గించడానికి అనుకూలంగా లేదని ఆమె అన్నారు. సైనిక మోహరింపు ఆ ప్రాంతంలో శాంతిని కాపాడటానికి సాయం చేయదని ఆమె అన్నారు.
భారత్-చైనాలు 3800 కి.మీ సరిహద్దును పంచుకుంటున్నాయి. చాలా చోట్ల సరిహద్దు స్పష్టంగా లేదు. 2020లో గాల్వాన్ ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు మరణించారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు భారత్‌కి చెందిన ప్రాంతాలను కూడా చైనా తమవిగా చెప్పుకుంటోంది. పలుమార్లు సరిహద్దు దాటి భారత్‌లోకి పీపుల్ లిజరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) దళాలు ప్రవేశిస్తున్నాయి. వీరికి భారత సైన్యం ధీటుగా సమాధానం ఇస్తోంది.