Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ తమ ప్రాంతమని డ్రాగన్ కంట్రీ చైనా చెబుతోంది. అయితే, ఎప్పటికప్పుడు చైనా వాదనల్ని భారత్ తిప్పికొడుతోంది. తాజాగా మరోసారి ఇండియాపై చైనా తన అక్కసు వెళ్లగక్కింది. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరుణాచల్‌పై చేసిన వాదనల్ని భారత్ తీవ్రంగా తప్పుపట్టింది.
షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను నిషేధించే ప్రతిపాదన బుధవారం యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఆమోదించబడింది. టిక్‌టాక్‌పై నిషేధం తర్వాత చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది
ప్రస్తుతం మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల యుగం నడుస్తోంది అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ప్రస్తుత జీవనంలో మనుషుల పనులు ఎక్కువగా కంప్యూటర్లలోనే జరుగుతున్నాయి. వీటివల్ల మన కళ్ల పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అదేవిధంగా ఎక్కువ సేపు చెవిలో హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్లు పెట్టుకోవడం ద్వారా మన వినికిడి సమస్యకు దారులు తీస్తున్నాయి. ఇదే విషయం తాజాగా ఓ చైనా మహిళ విషయంలో కూడా జరిగింది. గడిచిన 2 సంవత్సరాల పాటు ప్రతిరోజు…
Bird Flu: 2019లో మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. తన రూపాన్ని మార్చుకుంటూ అన్ని దేశాల్లో మరణాలకు కారణమైంది. కోవిడ్-19 మిగిల్చిన విషాదాన్ని ఇప్పటికీ ప్రపంచం మరిచిపోలేకపోతోంది. ఇదిలా ఉంటే సమీప భవిష్యత్తులో మరో పాండెమిక్ వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దానిని ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు సిద్ధం అవుతున్నాయి.
TikTok: భారత్ జాడలోనే అమెరికా నడిచింది. చైనాకు షాక్ ఇస్తూ ప్రముఖ వీడియో ప్లాట్ఫారం టిక్ టాక్‌కి వ్యతిరేకం బిల్‌ని ఆమోదించింది. యూఎస్ ప్రతినిధుల సభ భారీ మెజారిటీతో బిల్లుకు బుధవారం ఆమోదం తెలిపింది. టిక్ టాక్ని తన చైనా ఓనర్ బైట్ డ్యాన్స్ నుంచి బలవంతంగా ఉపసంహరించుకోవాలనే బిల్లుకు అమెరికా ఆమోదం తెలిపింది. ఒక వేళ ఇది జరగకుంటే అమెరికాలో టిక్ టాక్ని నిషేధించవచ్చు.
ఇవాళ (బుధవారం) ఉదయం 7.55 గంటలకు చైనా రాజధాని బీజింగ్ నగరానికి 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న యాంజియావోలో భారీ పేలుడు సంభవించింది. యాంజియావోలోని ఒక పాత భవనంలోని కింది అంతస్తులో నడుపుతున్న రెస్టారెంట్ లో గ్యాస్ పేలుడు సంభవించింది.
China: మాల్దీవుల సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడంలో తాము మద్దతు ఇస్తున్నామని చైనా మంగళవారం ప్రకటించింది. ఫస్ట్ బ్యాచ్ భారత సైనిక సిబ్బంది మాల్దీవులను విడిచిపెట్టింది. వారి స్థానంలో పౌరసిబ్బందిని నియమించింది. హెలికాప్టర్ సేవల్ని నిర్వహిస్తున్న భారత సైన్యం దేశాన్ని విడిచిపెట్టినట్లు మాల్దీవుల మీడియా సోమవారం తెలిపింది.
పాకిస్తాన్‌తో మాట్లాడటానికి భారతదేశం ఎప్పుడూ తలుపులు మూసుకోలేదు అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. అయితే, ఇస్లామాబాద్ నుంచి న్యూ ఢిల్లీకి వచ్చిన చర్చలు జరిపితే ఇది సాధ్యం అవుతుందని తెలిపారు.
Maldives : కొద్ది రోజుల క్రితమే మాల్దీవులకు ఉచితంగా సైనిక సహాయం అందించేందుకు రక్షణ సహకార ఒప్పందంపై చైనా సంతకం చేసింది. మాల్దీవులు కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో గస్తీ కోసం టర్కీ నుండి డ్రోన్లను కొనుగోలు చేసింది.
China: చైనా-భారత్ సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ బోర్డర్లో మరింత మంది సైన్యాన్ని మోహరించింది. అయితే, ఈ పరిణామాలు డ్రాగన్ కంట్రీ చైనాకు మింగుడు పడటం లేదు. వివాదాస్పద సరిహద్దుల్లో భారత్ మరిన్ని బలగాలను మోహరించడం ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఉపయోగపడేది కాదని చైనా విశ్వసిస్తోదని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి శుక్రవారం అన్నారు. చైనాతో వివాదాస్పద సరిహద్దులను మరింత బలోపేతం చేసేందుకు 10,000 మంది సైన్యాన్ని మోహరించింది.