పాకిస్తాన్‌తో మాట్లాడటానికి భారతదేశం ఎప్పుడూ తలుపులు మూసుకోలేదు అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. అయితే, ఇస్లామాబాద్ నుంచి న్యూ ఢిల్లీకి వచ్చిన చర్చలు జరిపితే ఇది సాధ్యం అవుతుందని తెలిపారు. కానీ, పాక్ తో చర్చలు జరిపిన ప్రయోజనం ఉండదనే భావన ఉంది.. ఎందుకంటే.. ఉగ్రవాద శిబిరాలను కలిగి ఉంది.. దీని వల్ల చర్చలు జరపడం కష్టం అని ఆయన చెప్పుకొచ్చారు. ఎప్పుడైనా కానీ, ఉగ్రవాద సమస్య న్యాయంగా ఉండాలని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు.
Read Also: AE Rahul Betting Case: కీసర ఏఈ రాహుల్ అరెస్ట్.. ఢిల్లీలో అదుపులో తీసుకున్న పోలీసులు
ఇక, భారతదేశం-చైనా సంబంధాలపై విదేశాంగ సంబంధాలపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. భారత సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి గతంలో చైనా వైపు నుంచి వచ్చిన ఆఫర్ల గురించి ఆయన తెలిపారు. ఏ దేశమైనా సరిహద్దు వివాదం విషయంలో కల్పించుకుని చర్చల ద్వారా సమస్యలను పరిష్కారం చేసుకోవాలన్నారు. వాస్తవ నియంత్రణ రేఖపై ఇరు దేశాలకు అన్ని శక్తులు ఉండాలి.. ఎందుకంటే ఇది రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనం కలిగి ఉంటుందన్నారు. మేము సంతకం చేసిన ఒప్పందాలను గమనించడం మా ఉమ్మడి హక్కు అని ఆయన చెప్పుకొచ్చారు. ఉమ్మడి ప్రయోజనాలే కాదు, ఇది చైనా ప్రయోజనాలకు కూడా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను అని జైశంకర్ తెలిపారు.
Read Also: T20 World Cup 2024: సీఏపై ఒత్తిడి తెస్తున్న కోచ్.. ఆస్ట్రేలియాకు కొత్త కెప్టెన్!
అయితే, గత నాలుగేళ్లుగా మనం చూస్తున్న భారత్- చైనా దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం రెండు దేశాలకు ఏమాత్రం ఉపయోగపడలేదు అని ఎస్ జైశంకర్ అన్నారు. మే 5, 2020న పాంగోంగ్ లేక్ ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘర్షణ తర్వాత తూర్పు లడఖ్ సరిహద్దులో ప్రతిష్టంభన ఏర్పడింది.. జూన్ 2020లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా తగ్గిపోయాయని ఆయన పేర్కొన్నారు. దీంతో ఇరు దేశాల మధ్య అత్యంత తీవ్రమైన సైనిక సంఘర్షణగా గుర్తించబడిందన్నారు.. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి భారత్- చైనా ఇటీవల తాజాగా అత్యున్నత స్థాయి సైనిక చర్చలను నిర్వహించాయి. ఇరు పక్షాలు శాంతి- ప్రశాంతతను కొనసాగించడానికి అంగీకరించాయని జైశంకర్ వెల్లడించారు.