Smuggling: చైనాలో ఓ వ్యక్తి 100కి పైగా సజీవ పాములను స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించి అధికారులకు పట్టుబడ్డాడు. అయితే, అతను వీటన్నింటి ప్యాంటులో దాచడం చర్చనీయాంశంగా మారింది. అధికారులు 104 సజీవంగా ఉన్న పాములను అతని ప్యాంటు జేబుల్లో కనుగోన్నారు.
పొరుగు దేశం చైనా తన చేష్టలను వదిలిపెట్టడం లేదు. తూర్పు లడఖ్‌లో చైనా తన ఉనికిని పటిష్టం చేసుకునే పనిలో రోజురోజుకూ బిజీగా ఉంది. తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు పరిసర ప్రాంతాల్లో కూడా చైనా సైన్యం చాలా కాలంగా తవ్వకాలు జరుపుతోంది.
చైనాలోని షాన్డాంగ్లో తుపాను(టోర్నాడో) భారీ విధ్వంసం సృష్టించింది. తూర్పు చైనా ప్రావిన్స్ షాన్డాంగ్లోని ఒక నగరంలో సుడిగాలి కారణంగా ఐదుగురు మరణించారని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా తెలిపింది.
కజకిస్థాన్ రాజధాని అస్తానాలో ఉగ్రవాదంపై ప్రధాని నరేంద్ర మోడీ చాణక్య అని పిలిచే విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌పై మండిపడ్డారు. షాంఘై సహకార సంస్థ(SCO) సమావేశంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సహా పలు దేశాల నేతలు పాల్గొన్నారు.
S Jaishankar: కజకిస్తాన్ వేదికగా ఆస్తానాలో జరుగుతున్న షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సమ్మిట్‌కి భారతదేశం తరుపున విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యితో భేటీ అయ్యారు.
చైనాలో ఓ ప్రైవేటు రాకెట్ కుప్పకూలింది. ప్రయోగం ప్రారంభం అయిన కొన్ని క్షణాల్లో నిప్పులు చిమ్ముకుంటూ సమీప అడవుల్లో కుప్పకూలింది. ఆదివారం చైనీస్ టియాన్‌లాంగ్-3 రాకెట్ సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో ప్రయోగం చేపట్టారు.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నోట శాంతిసందేశం ఆశ్చర్యం కలిగించింది. విదేశీ విధానానికి సంబంధించి భారత్ తీసుకొచ్చిన పంచశీల ఒప్పందం మెరుగైందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు.
Alcohol : మద్యం వల్ల ఏటా 26 లక్షల మందికి పైగా మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది మద్యం, మాదక ద్రవ్యాల వల్ల వచ్చే వ్యాధులతో బాధపడుతున్నారు.
చంద్రమండల యాత్రల్లో చైనా మరో ఘనత సాధించింది. ప్రపంచ చరిత్రలో తొలిసారి జాబిల్లికి ఆవలి వైపు నమూనాలు సేకరించి.. వాటిని విజయవంతంగా భూమి మీదకు తీసుకొచ్చింది. చంద్రుడి రెండో వైపు నుంచి మట్టి, శిథిలాలను మోసుకుని చాంగే-6 వ్యోమనౌక భూమిని చేరుకుంది. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతాల్లో ఇది సురక్షితంగా ల్యాండ్ అయింది. మే 3వ తేదీన చాంగే-6 నింగికెగిరి దాదాపు 53 రోజుల పాటు ప్రయాణించి జాబిల్లిని చేరింది.
చైనాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో.. రానున్న తుఫాను దృష్ట్యా ఎమర్జెన్సీని పొడిగించారు. అక్కడి వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. రాబోయే వారంలో యాంగ్జీ నది మధ్య, దిగువ ప్రాంతాలలో నిరంతరంగా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన నేపథ్యంలో ఈ అత్యవసర పరిస్థితి ఏర్పడింది.