China : చైనా ఎల్లప్పుడూ దాని ఆధునిక మౌలిక సదుపాయాలు, అత్యాధునిక సాంకేతికత కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇటీవల వర్షాల సమయంలో ఈ దేశంలోని మౌలిక సదుపాయాల గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఇటీవల వర్షాల సమయంలో అక్కడ ఒక వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లో ఉన్న షాంగ్లూలో, జూలై 19 శుక్రవారం వర్షం కారణంగా ఒక వంతెన కూలిపోయింది. ఇందులో సుమారు 11 మంది మరణించారు. చైనా మీడియా నుండి అందిన సమాచారం ప్రకారం, రాత్రి 8:40 గంటల సమయంలో కుండపోత వర్షం, వరదల కారణంగా ఈ వంతెన కూలిపోయింది.
Read Also:Pakistani Terrorists: పాక్ ఉగ్రవాదులను వేటాడేందుకు 500 కమాండోలు..
వంతెన కూలిన సమయంలో దాని పై చాలా ట్రాఫిక్ ఉంది. దీని కారణంగా వంతెన కూలిపోయిన వెంటనే, దానిపై వచ్చే , వెళ్లే ప్రజలు వారి వాహనాలతో పాటు నీటిలో పడిపోయారు. దీని కారణంగా ప్రజలు మరణించారు. జులై 20 ఉదయం రెస్క్యూ టీమ్ నదిలో పడిపోయిన వాహనాలను బయటకు తీశారు. జూలై 16 నుండి ఉత్తర, మధ్య చైనాలోని పెద్ద ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రాంతాలలో గణనీయమైన నష్టం వాటిల్లింది. CCTVలో వంతెన కొంత భాగం నీటిలో మునిగిపోయినట్లు చూడవచ్చు. ఈ ఘటనే కాకుండా చైనాలో కురుస్తున్న భారీ వర్షాలు కూడా చైనాలో విధ్వంసం సృష్టించాయి. వంతెన కూలిపోవడంతో పాటు, చైనాలోని షాంగ్సీలోని బావోజీ నగరంలో వర్షం కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల చాలా నష్టం జరిగింది. దీని కారణంగా దాదాపు ఐదుగురు మరణించారు.. మరో ఎనిమిది మంది గల్లంతు అయ్యారు.
Read Also:Dog Breeding: ఇంట్లో కుక్కలను పెంచుకోవడమే కాదు.. ఇవి కూడా చేయాలి..