2019 డిసెంబర్‌లో వూహాన్‌లో కరోనా మొదటి కరోనా కేసు వెలుగుచూసింది. అక్కడి నుంచి కరోనా వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించింది. అయితే, కరోనా కట్టడి విషయంలో చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని రవాణా వ్యవస్థను స్తంభింపజేసింది. ప్రజలను ఇంటికే పరిమితం చేసింది. ఆ తరువాత ఆ నగరం మెల్లిగా కరోనా నుంచి కోలుకుంది. అయితే, సంవత్సరం తరువాత మళ్లీ వూహన్ కరోనా కేసు నమోదైంది. దీంతో ఆ నగరంలో కరోనా కలకలం రేగింది. సంవత్సరం తరవాత కేసు నమోదవడంతో నగరంలోని కోటి మంది జనాభాకు మళ్లీ టెస్టులు నిర్వహించాలని అక్కడి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రజల్లో మళ్లీ భయాందోళనలు నెలకొన్నాయి. ఎంతమందికి ఇన్ఫెక్షన్లు ఉన్నాయో, ఎంతమందిని మళ్లీ ఐసోలేషన్ పేరుతో బందిస్తారో అని భయపడుతున్నారు. చైనాలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి అంటే దాని ప్రభావం మిగతా ప్రపంచదేశాలపై ఉండే అవకాశం ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
Read: 300 కోట్లు కాదు ఇంకా ఎక్కువ బడ్జెట్ తో మధు మంతెన ‘రామాయణం’!