చైనాలోని 17 ప్రావిన్స్‌లో కరోనా కేసుల పెరుగుతున్నాయి. సంవత్సరం తరువాత వూహాన్‌లో కొత్త కేసులు వెలుగు చూడటంతో ఆ నగరంలో తిరిగి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. కోటి మంది జనాభా ఉన్న వూహన్ నగరంలో అందరికీ టెస్టులు నిర్వహించి పాజిటివ్ ఉన్న వారిని ఐసోలేషన్‌లో ఉంచాలని చూస్తున్నారు. అయితే, ఇప్పుడు ఒక్క వూహాన్ నగరంలోనే కాకుండా ఆ దేశంలోని 17 ప్రావిన్స్‌లలో కేసులు పెరుగుతున్నాయి. చైనాలో ప్రాముఖ్యత కలిగిన నగరాలు, పర్యాటక పరంగా ప్రాముఖ్యత కలిగిన నగరాల్లో ఒకటి ఝాంగ్‌జియాజీ. ఈ నగరంలో కేసులు భారీగా పెరుగుతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరాన్ని పూర్తిగా మూసేయ్యాలని నిర్ణయం తీసుకొని నగరం మొత్తాన్ని మూసేశారు. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని, నగరంలో ఉన్న పర్యాటకులు ఎవరూ బయటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, కరోనా వైరస్ కట్టడి విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్దం అవుతున్నది.