చైనాలోని ఊహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ అయిందని ఇప్పటికే అనేక కథనాలు వెలువడ్డాయి. అమెరికాతో సహా అనేక దేశాలు కరోనా వైరస్ ల్యాబ్ నుంచే లీకయిందని, తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాలో గతంలో పర్యటించిన తరువాత ల్యాబ్ నుంచి వచ్చిందా లేదా అన్నదానిపై మరింత విపులంగా పరిశోధించాలని పేర్కొన్నది. ల్యాబ్ నుంచి లీకైందని కొట్టిపారెయ్యలేమని చెప్పింది. మరోసారి చైనాలో పర్యటించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ రెడీ అవుతున్న సమయంలో చైనా నిపుణులు కీలక వ్యాఖ్యలు చేశారు.
Read: వన్ ఇయర్ వర్కవుట్… ఎట్టకేలకు సన్నబడ్డ అర్జున్ కపూర్!
కరోనా వైరస్ సహజసిద్ధంగా జంతువుల నుంచి మనుషులకు సోకిందని, ల్యాబ్ నుంచి లీకైనట్టుగా వస్తున్న వార్తల్లో నిజాలు లేవని, అసలు ఊహాన్ వైరాలజీ ల్యాబ్‌లో కరోనా వైరస్‌లు లేవని, అలాంటి సమయంలో కరోనా ఎలా ల్యాబ్ నుంచి బయటకు వస్తుందని చైనా నిపుణుల బృందానికి అధ్యక్షత వహిస్తున్న లియాంగ్ వాన్నియన్ పేర్కొన్నారు. అసలు ఊహాన్ ల్యాబ్‌లో కరోనా వైరస్‌లు లేవని చెప్పడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగేలా కనిపిస్తున్నది. అమెరికా దర్యాప్తు సంస్థ ల్యాబ్ నుంచే వైరస్ లీకైందని ఎలా చెప్పింది. నివేదిక ఎలా ఇచ్చింది. ప్రపంచ దేశాలతో పాటుగా చైనాకు చెందిన కొందరు వ్యక్తులు కూడా ఈ వైరస్ అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రపంచంలో వూహాన్ వైరస్ పెద్ద మిస్టరీగా మారింది.