దక్షిణ చైనా సముద్రంలో చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. చుట్టుపక్కల ఉన్న చిన్న దేశాలపై ఆధిపత్యం సంపాదించేందుకు ప్రయత్నిస్తోంది. ఎప్పటినుంచో తైవాన్‌పై కన్నేసిన చైనా ఇప్పుడు ఆ దేశాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. తరచుగా చైనా యుద్ధ విమానాలు తైవాన్ బోర్డర్ వరకు వెళ్లి వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం 30 యుద్దవిమానాలు తైవాన్ బొర్డర్‌లో ఎగురుతూ కనిపించాయి. కాగా, తాజాగా 52 యుద్ధవిమానాలు తైవాన్ సరిహద్దులు దాటి లోనికి ప్రవేశించినట్టు తైవాన్ రక్షణశాఖ మంత్రి తెలిపారు. తైవాన్ దేశాన్ని ఆక్రమించుకోవడానికి చైనా ప్రయత్నాలను వేగవంతం చేసినట్టు తైవాన్ రక్షణశాఖ స్పష్టం చేసింది. అమెరికా తైవాన్ మధ్య ఇటీవలే 66 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం జరిగింది. 90 యుద్దవిమానాలను కొనుగోలు చేసేందుకు తైవాన్ ఒప్పందం కుదుర్చుకుంది. వీటితో పాటుగా మరో 66 యుద్ద విమానాల కొనుగోలుకు ఏడాది క్రితం మరో ఒప్పందం కూడా చేసుకున్నది. అమెరికా యుద్దవిమానాలు తైవాన్‌లోకి ప్రవేశిస్తే దాని వలన చైనాకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది. అందుకోసమే తైవాన్‌ను ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఒకవేళ చైనా కనుక తైవాన్‌ను ఆక్రమించుకుంటే దాని వలన మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read: యూపీ ప్రభుత్వంపై రాహుల్ ఫైర్… హథ్రాస్ ఘటనలోనూ అలానే చేశారు…