తైవాన్ సరిహద్దుల్లో మళ్లీ రడగ మొదలైంది. చైనాకు చెందిన 30 యుద్ధ విమానాలు తైవాన్ సరిహద్దుల్లోకి చొరబడ్డాయి. నెల రోజుల వ్యవధిలో 60సార్లు చైనా విమానాలు చొరబడినట్టు తైవాన్ పేర్కొన్నది. దీనిని ధీటుగా ఎదుర్కొనేందుకు తైవాన్ కుడా మిలటరీ ఆపరేషన్‌ను నిర్వహించింది. తైవాన్ యుద్ధ విమానాలు విన్యాసాలను ప్రదర్శించాయి. తైవాన్ పై చైనా ఆధిపత్యాన్ని సాగనివ్వబోమని మరోసారి తైవాన్ స్పష్టం చేసింది. తైవాన్ తమ భూభాగమే అని ఇప్పటికే చైనా ప్రకటిస్తూ వస్తున్నది. దానికి తైవాన్ అంగీకరించడం లేదు. అంతేకాదు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొని తీరుతామని స్పష్టం చేసింది.
Read: భవానీపూర్‌లో మమతా బెనర్జీ భారీ విజయం…