Hidma: ఛత్తీస్గఢ్ బస్థర్ లో 31 మార్చి 2026 వరకు మావోయిస్ట్ లను అంతమొందిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టుదలతో ఉన్నాయి. ఇప్పటికే భద్రతబలగాలు హిడుమ.. బార్సే దేవను బలగాలు చుట్టుముడుతున్న.. తప్పించుకుంటున్నారని అనుక్షణం వాళ్ళ లొకేషన్ మారుతుందని అయినప్పటికీ వాళ్లు తమ కనుసన్నల్లోనే ఉన్నారని వారు ఇరువురిని లొంగిపోవాలని లేనిపక్షంలో వారికి చావు తప్పదని బస్టర్ ఐజీ సుందర్ రాజ్ హెచ్చరించారు. గత కొద్ది రోజులుగా నారాయణపూర్ జిల్లా అబూజ్ మాడ్, ఇంద్రావతి నది పరిసర…
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నేషనల్ పార్క్ అడవి ప్రాంతాన్ని 25,000 మంది కేంద్ర భద్రత బలగాలు ముట్టడి చేశాయని సమాచారం నేషనల్ పార్క్ ఏరియాలో మావోయిస్టు పార్టీ అగ్రనేత మాడవి హిడ్మ, దేవా ను లక్ష్యంగా చేసుకొని బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నారని సమాచారం అందుతుంది. కగార్ పేరుతో ఇప్పటికీ జనవరి ఒకటి నుంచి 560 మందిని ఎన్కౌంటర్ పేరా కాల్చి చంపి రాజ్యాంగ ఉల్లంఘనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాల్పడుతున్నాయి. 25వేల మంది కేంద్ర బలగాలు వెంటనే వెనక్కి…
దేశ వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో మావోయిస్టులకు తీవ్ర ప్రతి ఘటనలు ఎదురవుతున్నాయి. కేంద్రం చేపట్టిన ఆపరేషన్‌లో మావోయిస్ట్ కీలక నేతలతో సహా పలువురు మృత్యువాత పడ్డారు.
మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే దాదాపు కీలక నేతలు హతమయ్యారు. వారికి కంచుకోట అయిన ఛత్తీస్‌గఢ్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌తో నెత్తురోడుతోంది. ఈ అంశంపై తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో ఎలాంటి చర్చలు జరిపేదే లేదని పునరుద్ఘాటించారు. ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో కలిసి పోవాలని సూచించారు.
Chhattisgarh: ఛత్తీస్గఢ్ బీజాపూర్లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ భీకర ఎన్కౌంటర్తో దద్దరిల్లుతోంది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ శనివారం కూడా కొనసాగుతోంది. ఇప్పటికే కీలక మావోయిస్టులను హతమైనట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు ఇప్పటి వరకు ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు.
పరేషన్ కాగార్ పేరుతో కర్రె గుట్టలను చుట్టుముట్టి అక్కడ పెద్ద మొత్తంలో మావోయిస్టు పార్టీకి నష్ట్రాన్ని చేకూర్చింది భద్రతా బలగాలు. అది పూర్తైన తర్వాత అబుజుమడుని తమ హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. మరోవైపు, ఇంద్రవతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు భద్రతా బలగాలు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్నాయి.
ఛత్తీస్ఘఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాను నక్సల్ ప్రభావిత ప్రాంతాల జాబితా (LWE - లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం) నుంచి తొలగిస్తూ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఇది ఛత్తీస్ఘఢ్ రాష్ట్రానికి, ముఖ్యంగా బస్తర్కు ఒక చారిత్రాత్మక విజయంగా పరిగణించబడుతుంది. గత కొన్ని ఏళ్లుగా భద్రతా దళాలు, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రజల ఉమ్మడి ప్రయత్నాల కారణంగా బస్తర్లో నక్సలైట్ల ఏరివేత సమర్థవంతంగా ముగిసింది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం శాంతి పునరుద్ధరించబడింది.
దేశ వ్యాప్తంగా మావోల ఏరివేతకు కేంద్రం పూనుకుంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో తిష్ట వేసిన మావోయిస్టుల ఏరివేతకు ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఇక ఇటీవల కాలంలో మావోలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Lightning: ఛత్తీస్గఢ్ ధమ్తారి జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. 30 ఏళ్ల వ్యక్తి ఫోన్ మాట్లాడుతుండగా పిడుగుపాటుకు గురై మరణించాడు. పిడుగుపడి తీవ్రగాయాలైన వ్యక్తిని సమీపం ఆస్పత్రికి తరలించారు. గాయాలు ఎక్కువగా ఉండటంతో జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అయితే, మార్గం మధ్యలోనే అతను మరణించాడు. బాధితుడిని రోహిత్ కుమార్ సిన్హాగా గుర్తించారు.