Hidma: ఛత్తీస్‌గఢ్ బస్థర్ లో 31 మార్చి 2026 వరకు మావోయిస్ట్ లను అంతమొందిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టుదలతో ఉన్నాయి. ఇప్పటికే భద్రతబలగాలు హిడుమ.. బార్సే దేవను బలగాలు చుట్టుముడుతున్న.. తప్పించుకుంటున్నారని అనుక్షణం వాళ్ళ లొకేషన్ మారుతుందని అయినప్పటికీ వాళ్లు తమ కనుసన్నల్లోనే ఉన్నారని వారు ఇరువురిని లొంగిపోవాలని లేనిపక్షంలో వారికి చావు తప్పదని బస్టర్ ఐజీ సుందర్ రాజ్ హెచ్చరించారు.
గత కొద్ది రోజులుగా నారాయణపూర్ జిల్లా అబూజ్ మాడ్, ఇంద్రావతి నది పరిసర అటవీ ప్రాంతాల్లో అలాగే నేషనల్ పార్క్ ఏరియాల్లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. గత కొద్ది రోజులుగా ముఖ్యంగా.. మావోయిస్టు పార్టీ జాతీయ సెక్రటరీ నంబాల కేశవరావును అంతమొందించిన అనంతరం.. నేషనల్ పార్క్ ఏరియాలో మరి కొంతమంది ముఖ్య నాయకులను హతమార్చారు.
Read Also:CM Revanth Delhi Tour: ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్.. కేంద్ర మంత్రులతో కీలక చర్చలు..!
గతంలో పోలీసులకి మావోయిస్టులకి ఎదురు కాల్పులు జరిగితే చనిపోయిన మావోయిస్టులు ఎవరు అనేది గుర్తించాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పెద్ద క్యాడర్ నాయకులను టార్గెట్ చేస్తూ సాటిలైట్ తో అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ డ్రోన్లు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ మావోయిస్టుల కదలికలను ఇట్టే పసిగడుతున్నారు. దీనితో ఎన్నో సంవత్సరాలుగా అడవులను వారి కంచుకోటలల మార్చుకొన్నా కూడా మావోల నాయకులు పిట్టల రాలినట్టు రాలుతున్నారు .
ముఖ్యంగా సరెండర్ అయిన మావోయిస్టులను పోలీసులు ఇన్ ఫార్మర్లుగా మలుచుకుంటున్నారు. వారు ఇచ్చిన సమాచారాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆపరేషన్లు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో పి.ఎల్.జి.ఏ. (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ) నెంబర్ వన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మడివ హిడమ.. ఇంద్రావతి నది ఏరియాలో, నేషనల్ పార్క్ ఏరియాలో సంచరిస్తున్నాడని బస్టర్ ఐజి సుందర్ రాజ్ ప్రకటన విడుదల చేశారు.
Read Also:Wiaan Mulder: అందుకే బ్రియాన్ లారా రికార్డ్ ను వదిలేశా.. వియాన్ ముల్డర్ సంచలన వ్యాఖ్యలు..!
గతంలో కూడా ఐజీ స్థాయి అధికారి ఇలా ప్రకటన చేసి ఆపరేషన్ లకు భద్రతా బలగాలను పంపడం అనేది ఎప్పుడూ లేదు. కానీ, మొట్టమొదటిసారి ఐజి స్థాయి అధికారి నెంబర్ వన్ కమాండర్ మడివి హిడమ, నెంబర్ 2 కమాండర్. బార్సే దేవా గత కొద్ది రోజులుగా తమ కనుసున్నల్లోనే వారు ఉన్నట్లు.. గతంలో 300కు పైగా ఉన్న బెటాలియన్ ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గిందని దానికి కారణం భారీ ఎన్కౌంటర్ లు, లొంగుబాట్లు, అరెస్టులతో మావోయిస్టులు తగ్గారని పోలీస్ నిఘా వర్గాలు చెబుతున్నాయి.
కొద్దిమంది సాటిలైట్, డ్రోన్స్ ఆధారంగా వారి కదలికలు తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉందని బస్టర్ ఐజి సుందర్ రాజ్ తెలిపారు. దానికి సంబంధించి వేలమంది బలగాలు ఇప్పుడు నేషనల్ పార్క్ ఏరియా ఇంద్రావతి నది ఏరియా లో అడుగడుగు గాలిస్తున్నట్లు తెలిపారు. ఈసారి కచ్చితంగా మడిమి హిడ్మా, దేవాలను అంతమొందిస్తామని దృఢ నిశ్చయంతో ఉన్నట్లు ఐజి తెలిపారు.