ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీస్ వాహనాన్ని మావోయిస్టులు ఐఈడీతో పేల్చేశారు. కొంటా-ఎర్రబోరా రోడ్డులోని డోండ్రా సమీపంలో ఐఈడీ పేలింది. ఈ ఘటనలో సుక్మా జిల్లా కొంటా డివిజన్ అదనపు పోలీస్ సూపరింటెండెంట్ (ASP) ఆకాష్ రావు గిరిపుంజే చనిపోయారు. ఆయనతో పాటు మరికొందరు అధికారులు, జవాన్లు గాయపడ్డారు. అయితే ఆకాష్ రావును దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా.. అనంతరం మెరుగైన వైద్యం కోసం మరొక ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు.
ఇది కూడా చదవండి: Sonam-Raja Wedding: సోనమ్-రాజా వెడ్డింగ్ వీడియో వైరల్.. ఆ సమయంలో సోనమ్ ఎలా ఉందంటే..!
జూన్ 10న సీపీఐ (మావోయిస్ట్) భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. అయితే అదనపు ఎస్పీ ఆకాష్ రావు ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఐఈడీ పేలింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆకాష్ రావు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య కోసం ఉన్నత వైద్య కేంద్రానికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా మృతిచెందారు.
ఇది కూడా చదవండి: Meghalaya: నా కూతురికి ఏ పాపం తెలియదు.. సీబీఐ విచారణకు సోనమ్ తండ్రి డిమాండ్
ఇటీవల కేంద్రం మావోల ఏరివేత ప్రారంభించింది. ఈ ఆపరేషన్ లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యమైన మావోయిస్టులంతా హతమయ్యారు. దీంతో మావోల ప్రాబల్యం తగ్గుతోంది. ఇక కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కు వ్యతిరేకంగా రేపు బంద్ కు పిలుపునిచ్చారు. ఇంతలో మావోలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.