Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో కీలక పరిణామం.. 13 మంది మావోలు లొంగుబాటు
- ఛత్తీస్‌గఢ్‌లో కీలక పరిణామం
- 13 మంది మావోలు లొంగుబాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో మావోయిస్టులకు తీవ్ర ప్రతి ఘటనలు ఎదురవుతున్నాయి. కేంద్రం చేపట్టిన ఆపరేషన్‌లో మావోయిస్ట్ కీలక నేతలతో సహా పలువురు మృత్యువాత పడ్డారు. దీంతో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక అభయారణ్యంలో మావోల మనుగడ కష్టంగా మారింది. ఇప్పటికే తమ ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవాలని కేంద్రం ఆదేశించింది. ఈ పిలుపు సత్ ఫలితాన్ని ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Pawankalyan : ‘హరిహర వీరమల్లు’ మేకర్స్ ప్లానింగ్‌పై పవన్ ఫ్యాన్స్ ఫైర్.. !
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 8 మంది మహిళలు సహా 13 మంది లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ.23 లక్షల రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు. కేంద్రం కల్పించిన నిబంధనల ప్రకారం లొంగిపోయిన మావోలకు పునరావాసం కల్పిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Gold Rate Today: పసిడి ప్రియులకు శుభవార్త.. 90 వేలకు దిగొచ్చిన బంగారం!
ఇక లొంగిపోయిన మహిళల్లో ఒకరైన దేవ్ ముచాకి అలియాస్ ప్రమీల (21)పై రూ.8లక్షల రివార్డు ఉంది. ఇక ధమ్తారి-గరియాబంద్-నువాపాడ డివిజన్ పరిధిలోని ఏరియా కమిటీ సభ్యుడైన కోసా ఓయం అలియాస్ రాజేంద్ర అలియాస్ మహేష్ అలియాస్ మహేష్ సాగర్ అలియాస్ రమేష్ (29) పై రూ. 5 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో మావోయిస్టు కోసి పోడియం (27) తలపై రూ.2 లక్షల రివార్డు ఉంది. సమ్మి సెమ్లా (23), ఛోటూ పార్సిక్ అలియాస్ దీపక్ (25), మోతీ తాటి (24), సునీత హేమ్లా (24), మంజుల కుంజమ్ (27), సైబో పొడియం (18), హంగీ ఉండుమ్ అలియాస్ రాధ (21) తలపై రూ.లక్ష చొప్పున రివార్డు ఉందని.. మిగతా ముగ్గురికి ఎలాంటి పారితోషికం లేదని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన నక్సలైట్లకు ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున అందించామని, ప్రభుత్వ విధానం ప్రకారం వారికి పునరావాసం కల్పిస్తామని అధికారి తెలిపారు. ఈ సంవత్సరం జిల్లాలో ఇప్పటివరకు 241 మంది నక్సలైట్లు హింసను విరమించుకున్నారని వెల్లడించారు.
తాజావార్తలు
-
IND vs AFG 3rd T20: అభిషేక్ శర్మ శివతాండవం.. ఆఫ్ఘన్‌పై భారత్ ఘనవిజయం.. 3-0తో క్లీన్ స్వీప్
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లలో కయాదు మిస్సింగ్.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని షాకింగ్ కామెంట్స్!
-
Apple iPhone 18 Pro Sale: iPhone 18 Pro కొనుగోలు కోసం రాత్రి నుంచే భారీ క్యూ.. Apple స్టోర్ వద్ద కస్టమర్ల సందడి
-
Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
-
Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!