రోజురోజుకు ప్రభుత్వ ఉద్యోగులు మరి దారుణంగా తయారవుతున్నారు. క్లాస్ రూంలో ఓ ప్రభుత్వ టీచర్ ఫుల్ గా తాగి నిద్రపోయాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. చత్తీస్ ఘడ్ కోర్భా జిల్లా జార్వే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చంద్రపాల్ పైక్రా అనే ప్రధానోపాధ్యాయుడు ఫుల్ గా మద్యం తాగి స్కూల్ టేబుల్ పై కాళ్లు పెట్టుకుని దర్జాగా పడుకున్నాడు. ఆయన పడుకున్న వీడియోను ఎవరో వీడియో తీసి పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఈ పాఠశాలలో మొత్తం 46 మంది పిల్లలు చేరారు, వారు రెండు తరగతుల్లో కూర్చుంటారు. ఒక తరగతిలో దేవ్ ప్రసాద్ బర్మన్ అనే ఉపాధ్యాయుడు బోధిస్తుండగా, మరొక తరగతిలో పిల్లలు తమ సరదాలో బిజీగా ఉన్నారు, మరోవైపు ప్రధానోపాధ్యాయుడు తాగి తన కార్యాలయంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇక్కడ చదువుతున్న పిల్లల భవిష్యత్తు తెలియదు కానీ నెలకు రూ. లక్ష జీతం పొందుతున్న హెడ్ మాస్టర్ చంద్రపాల్ జీవితం సురక్షితంగా ఉంది. ఈ హెడ్ మాస్టర్ కు చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి పేరు గానీ దేశ ప్రధాని పేరు కూడా తెలియదు.
ప్రధానోపాధ్యాయుడు తరచుగా తాగి వస్తాడని.. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పినప్పటికి అతడిపై ఎటువంటి చర్యలు కుూడా తీసుకోవడంలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నియమించబడిన ఉపాధ్యాయులు తాగి పాఠశాలకు రావడం ఇదే మొదటిసారి కాదని వారు అంటున్నారు. ఈ వీడియో జిల్లా విద్యాధికారికి పంపించామన బీఈఓ సందీప్ పాండే తెలిపారు. వెంటనే అతడిపై చర్యలు తీసుుకుంటామన్నారు.