Maoists : తెలంగాణ రాష్ట్ర పోలీసులు మావోయిస్టులకు గట్టి షాక్ ఇచ్చారు. మావోయిస్టు ఉద్యమంలో కీలక స్థానంలో ఉన్న ఇద్దరు ముఖ్య వ్యక్తులు తాజాగా పోలీసుల వలలో చిక్కారు. అందులో రాష్ట్ర కమిటీ సభ్యురాలు సునీత ఒకరు. ఆమె మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ భార్యగా గుర్తించారు. సుదీర్ఘకాలంగా భూగర్భంలో ఉంటూ పార్టీ కార్యక్రమాలను నడిపిస్తున్న సునీత అరెస్టు మావోయిస్టు నేతృత్వానికి పెద్ద దెబ్బగా పోలీసులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా మరో మావోయిస్టు నాయకుడు చెన్నూరి హరీష్ కూడా స్వచ్ఛందంగా లొంగిపోయాడు. మావోయిస్టు కదలికలు ఎక్కువగా ఉన్న తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ పరిణామం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఆయన లొంగిపోవడమే కాకుండా, ఇప్పటి వరకు మావోయిస్టుల కార్యకలాపాలపై తనకు తెలిసిన విషయాలను అధికారులకు వెల్లడిస్తున్నట్లు సమాచారం.
JR NTR : ఎన్టీఆర్ కోసం జపాన్ నుంచి వచ్చిన అమ్మాయి..
ఇక ఈ తాజా పరిణామాలు మావోయిస్టుల భవిష్యత్ వ్యూహాలకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు బలగాలను సమీకరించే ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో, అగ్రనేతల అరెస్టులు, లొంగిపోవడం వారిలో ఆందోళనను పెంచుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర పోలీసులు ఇప్పటికే మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లను మరింత వేగవంతం చేశారు. అడవీ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్లను కట్టుదిట్టం చేస్తూ, భూగర్భంలో దాక్కున్న ఇతర నేతలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో సునీత అరెస్టు, హరీష్ లొంగిపోవడం మావోయిస్టు కదలికలను బలహీనపరిచే అవకాశం ఉందని అధికారులు విశ్వసిస్తున్నారు.
Nellore Lady Don Arrest: రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు.. నెల్లూరు లేడీ డాన్ అరెస్ట్..