మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న లొంగిపోయారు. ఆశన్నతో పాటు 208 మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ సీఎం, హోంమంత్రి సమక్షంలో లొంగిపోయారు. మావోయిస్టులు అందరూ సీఎం విష్ణుదేవ్ సమక్షంలో ఆయుధాలను అప్పగించారు. ఆశన్న బీజాపూర్ మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడుగా పని చేశారు. లొంగుబాటు నేపథ్యంలో ఆశన్న సహచరులను ఉద్దేశించి చివరి ప్రసంగం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయుధాలను వదిలిపెడుతున్నాం అని, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో ఉండలేమన్నారు. ‘ఎవరికి వారే తమ…
Maoist Surrender: మావోయిస్టులకు వరసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవ రావు అలియాస్ ఆశన్న లొంగిపోనున్నారు. రేపు, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ముందు ఆయన లొంగిపోతారు. ఆశన్నతో పాటు 70 మంది మావోయిస్టులు ఆయుధాలు అప్పగించనున్నారు.
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మావోయిస్టులకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. మావోల నుంచి కాల్పులు విరమణ ప్రతిపాదన వచ్చిన తర్వాత, ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టులతో కాల్పుల విరమన ప్రసక్తే లేని ఆదివారం అన్నారు. శాంతిని కోరుకునే వారు వెంటనే లొంగిపోవాలనే హెచ్చరికలు జారీ చేశారు.
మావోయిస్టుల ఏరివేతలో ఛత్తీస్‌గఢ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇద్దరు మావోయిస్టు జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. జగ్గు కుర్సం అలియాస్ రవి అలియాస్ రమేష్ (28), అతని భార్య కమలా కుర్సం (27) ను సెప్టెంబర్ 23న చంగోరభట్ట దగ్గర అరెస్టు చేశారు.
Maoists: కేంద్రం మావోయిస్టులకు వ్యతిరేకం నిర్వహిస్తున్న ‘‘ఆపరేషన్ కగార్’’ దెబ్బకు పలువురు మావోయిస్టుల లొంగిపోతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో రూ.64 లక్షలు రివార్డు ఉన్న 30 మందితో సహా 71 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 17 బాలుడు, 16,17 ఏళ్లు కలిగిన ఇద్దరు మైనర్ బాలికలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని దంతేవాడ పోలీసులు వెల్లడించారు.
Maoist Ceasefire: ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా బలగాలు దేశంలో మావోయిస్టులను లేకుండా చేసేందుకు వరసగా దాడులు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో భద్రతా బలగాలు పలు ఎన్కౌంటర్లలో కీలకమైన మావోయిస్టు లీడర్లను హతమార్చారు. ఇది సెక్యూరిటీ ఫోర్సెస్కి కీలక విజయమని చెప్పవచ్చు. ఈ ఆపరేషన్ల నేపథ్యంలో మావోయిస్టులు ‘‘కాల్పుల విరమణ’’ను ప్రకటించారు. ఆయుధాలను వదిలేస్తామని కేంద్రానికి లేఖ రాయడం సంచలనంగా మారింది.
రోజురోజుకు ప్రభుత్వ ఉద్యోగులు మరి దారుణంగా తయారవుతున్నారు. క్లాస్ రూంలో ఓ ప్రభుత్వ టీచర్ ఫుల్ గా తాగి నిద్రపోయాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. చత్తీస్ ఘడ్ కోర్భా జిల్లా జార్వే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చంద్రపాల్ పైక్రా అనే ప్రధానోపాధ్యాయుడు ఫుల్ గా మద్యం తాగి స్కూల్ టేబుల్ పై కాళ్లు పెట్టుకుని దర్జాగా పడుకున్నాడు. ఆయన పడుకున్న వీడియోను ఎవరో వీడియో తీసి పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో తెగ…
తెలంగాణ రాష్ట్ర పోలీసులు మావోయిస్టులకు గట్టి షాక్ ఇచ్చారు. మావోయిస్టు ఉద్యమంలో కీలక స్థానంలో ఉన్న ఇద్దరు ముఖ్య వ్యక్తులు తాజాగా పోలీసుల వలలో చిక్కారు. అందులో రాష్ట్ర కమిటీ సభ్యురాలు సునీత ఒకరు.
Chhattisgarh: ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో శుక్రవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. అబుజ్మడ్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు పోలీస్ అధికారులు చెప్పారు.
మద్యం మత్తులో ఓ యువతి హంగామా సృష్టించి కటకటాల పాలైంది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కోర్బాలో జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి పాష్ పామ్ మాల్ ప్రాంతంలో ఉన్న ఓఎన్సీ బార్ వెలుపల పెద్ద ఎత్తున గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న యువకులు, యువతుల బృందం బహిరంగ ప్రదేశంలో గొడవ సృష్టించింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. వీళ్లు రాత్రి ఆలస్యంగా బార్ నుంచి బయటకు వచ్చారు. అనంతరం తమలో తాము గొడవ పడటం…