Chhattisgarh Encounter: దేశంలో నక్సలైట్ల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయి. ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో నక్సలైట్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆపరేషన్‌లో భద్రతా దళాలు భారీ విజయం సాధించాయి. చింద్‌ఖరక్ అడవిలో భద్రతా దళాలు ముగ్గురు నక్సలైట్లను హతమార్చాయి. మృతి చెందిన ముగ్గురు నక్సలైట్లపై రూ.1.4 మిలియన్ల రివార్డ్ ఉంది. కాంకేర్-గారియాబంద్ DRG, BSF దళాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈక్రమంలో భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య సుదీర్ఘమైన కాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్‌కౌంటర్ తర్వాత భద్రతా దళాలు ఒక మహిళతో సహా ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలను గుర్తించారు.
READ ALSO: Pakistan: ట్రంప్ కోసం భూమిని తవ్వేందుకు సిద్ధమైన పాకిస్తాన్.. టార్గెట్ రేర్-ఎర్త్..
ఘటనా స్థలంలో పెద్దఎత్తున ఆయుధాలు
సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఒక SLR రైఫిల్, 303 రైఫిల్, 12 హ్యాండ్ గన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో భద్రతా దళాలు నక్సలైట్లకు చెందిన అనేక ఇతర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నాయి.
కాల్పుల్లో మరణించిన నక్సలైట్లను అధికారులు గుర్తించారు. ముగ్గురిలో నక్సలైట్ సర్వాన్ మడ్కం, రాజేష్ అలియాస్ రాకేష్ హేమ్లా, బసంతి కుంజమ్ అని పేర్కొన్నారు. వారిపై వరుసగా రూ.8లక్షలు, రూ.5 లక్షలు, రూ1 లక్ష రివార్డ్‌లు ఉన్నట్లు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మృతి చెందిన సర్వాన్ కోఆర్డినేషన్ ఏరియా కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. రాజేష్ నగరి ఏరియా కమిటీ గోబ్రా LOS కమాండర్ అని, బసంతి మెయిన్‌పూర్-నువాపాడ ప్రొటెక్షన్ టీమ్‌లో సభ్యురాలుగా ఉన్నట్లు పేర్కొన్నారు. బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్‌రాజ్ పి మాట్లాడుతూ.. ఇప్పుడు దేశంలో మావోయిజం చివరి దశలో ఉందని చెప్పారు. నక్సలైట్లు హింసను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు.
READ ALSO: India UNSC Veto Power: UNSCలో భారత్‌కు వీటో పవర్ దూరం చేస్తుంది ఏంటి? ఇండియా కల నెరవేరుతుందా!