తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది..ఎవరికీ అనుమానం రాకుండా రెండు పడవల్లో శ్రీలంకనుంచి భారత్కు సముద్ర మార్గంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా, కోస్టు గార్డు, డిఆర్ఐ అధికారులు, కస్టమ్ అధికారులు రెండు రోజులు గాలించి మొత్తం 32 కిలోల బంగారం వెలికితీశారు..ఈ బంగారం విలువ రూ.20 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో ఒక పడవలోని స్మగ్లర్లు అధికారులను చూడగానేభయంతో 11 కిలో బంగారాన్ని సముద్రంలో పడేశారు. అలాగే మరో పడవలో 21 కిలోల పుత్తడిని స్వాధీనం చేసుకున్నారు.. ఈ…
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ గ్రౌండ్ లో వర్షపు నీరు ఎక్కువగా నిలవడంతో గ్రౌండ్ సిబ్బంది హెయిర్ డ్రయ్యర్లు, స్పాంజీలు ఉపయోగించారు. పేరుకేమో ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డు.. కానీ పరిస్థితేమో ఇలా ఉంది అంటూ నెటిజన్లు బీసీసీఐపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Sarathbabu : సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యంతో మే 22న కన్నమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్త విని సినీ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధి కారణంగా ఆనారోగ్యంతో.. హైదరాబాదులోని ఏఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే ఇటీవల ఆయన అవయవాలు చెడిపోవడంతో సోమవారం ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
Sarath Babu : సీనియర్ నటుడు శరత్ బాబు మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శరత్ బాబు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. శరీరంలో ఇన్ఫెక్షన్ పెరగడంతో ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు వంటి మల్టీపుల్ ఆర్గాన్స్ దెబ్బతిన్నాయి.
రెండు కంటైనర్ ట్రక్కులు, చెన్నైలోని రిజర్వ్ బ్యాంక్ నుంచి విల్లుపురంకు రూ. 1,070 కోట్ల నగదును తీసుకువెళుతున్నాయి. ఒక్కోదాంట్లో రూ.535 కోట్లు ఉన్నాయి. ట్రక్కులలో ఒకటి సాంకేతిక లోపంతో చెన్నైలోని తాంబరంలో ఆగవలసి వచ్చింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ జాతీయ రహదారిపై నిలిపివేశాడు
తమిళనాడులోని విల్లుపురం జిల్లా , చెంగల్పట్టు జిల్లాల్లోని సంభవించిన కల్తీ మద్యం మరణాల సంఖ్య బుధవారానికి 21కి చేరింది. ఈ కల్తీ మద్యం కేసులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కొంత మంది అధికారులను కూడా విధుల నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే, కేకేఆర్ మ్యాచ్లో ఒక అద్బుత దృశ్యం చోటుచేసుకుంది. ఆదివారం చెన్నైలో జరిగిన మ్యాచ్లో చెన్నై ఓడిపోయిన సంగతి తెలిసిందే. టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ సీఎస్కే కెప్టెన్ ధోనీని ఆటోగ్రాఫ్ అడగడం ఆసక్తి కలిగించింది.
చెన్నై మహానగరంలోని కోయంబేడులో జరిగింది. కోయంబేడులో అనుమానస్పదంగా కనిపించిన ఓ కేరళ ముఠాకు చెందిన నలుగుర యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో బెంగళూరుకు చెందిన శివ, కేరళకు చెందిన కుబైట్, జిత్తు, ఇర్షాద్ లుగా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు.
కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ప్రముఖ నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరుడి కుమారుడు ఆయుష్ తేజస్ స్పందించారు. మా పెదనాన్న శరత్ బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. గతంలో కంటే ఇప్పుడు కొంచెం కోలుకున్నారని ఆయుష్ చెప్పుకొచ్చారు.
Chennai: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా కౌలాలంపూర్ నుంచి వచ్చి ఓ ప్రయాణికురాలి వద్ద ఏకంగా 22 పాములను గుర్తించారు. లగేజ్ బ్యాగుల్ని తనిఖీ చేస్తున్న క్రమంలో విషపూరితమైన పాములను అధికారులు గుర్తించారు. వీటిలో రకరకాల పాములు ఉన్నాయి. 10 అడుగులకు పొడవైన పాములను గుర్తించారు కస్టమ్స్ అధికారులు.