తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది..ఎవరికీ అనుమానం రాకుండా రెండు పడవల్లో శ్రీలంకనుంచి భారత్‌కు సముద్ర మార్గంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా, కోస్టు గార్డు, డిఆర్‌ఐ అధికారులు, కస్టమ్ అధికారులు రెండు రోజులు గాలించి మొత్తం 32 కిలోల బంగారం వెలికితీశారు..ఈ బంగారం విలువ రూ.20 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో ఒక పడవలోని స్మగ్లర్లు అధికారులను చూడగానేభయంతో 11 కిలో బంగారాన్ని సముద్రంలో పడేశారు.
అలాగే మరో పడవలో 21 కిలోల పుత్తడిని స్వాధీనం చేసుకున్నారు.. ఈ రెండు ఘటనల్లో రూ.20 కోట్లకు పైగా విలువ కలిగిన 32.60 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డిఆర్‌ఐ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు.. కొంతమంది స్మగ్లర్లు శ్రీలంకనుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు డిఆర్‌ఐ అధికారులకు సమాచారం అందింది. ఈమేరకు కోస్టుగార్డు , కస్టమ్స్ అధికారులతో కలిసి నిఘా పెట్టారు. ఈ క్రమంలో మండపం ఫిషింగ్ హార్బర్ సమీపంలో రెండు పడవల కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి.
ఆ రెండు పడవలను వెంబడించగా తప్పించుకునే క్రమంలో ఒక పడవలోని ముగ్గురు సగ్లర్లు తమ వద్ద ఉన్న 11.6 కిలోల బంగారం కడ్డీలను సముద్రంలో పడవేశారు వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా డైవర్లను రంగంలోకి దింపి రెండు రోజులపాటు తీవ్రంగా శ్రమించి సముద్రంలో పారేసిన బంగారాన్ని వెలికితీశారు. మరో పడవలోని 21 కిలోల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుని ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.. అసలు ఆ బంగారం ఎక్కడిది, ఎక్కడికి తీసుకెళ్తున్నారని అడిగి తెలుసుకుంటున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..