Sarathbabu : శరత్ బాబుకు తలకొరివి పెట్టేది ఎవరో తెలుసా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sarathbabu : సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యంతో మే 22న కన్నమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్త విని సినీ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధి కారణంగా ఆనారోగ్యంతో.. హైదరాబాదులోని ఏఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే ఇటీవల ఆయన అవయవాలు చెడిపోవడంతో సోమవారం ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో సంతాపం తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా మే 23న ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి. ఆయనకు తలకొరివి పెట్టేది ఎవరనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది.
Read Also:Rahul Gandhi : లారీ ఎక్కిన రాహుల్ గాంధీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Also Read
- Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
శరత్ బాబు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు అప్పటికే స్టార్ లేడీ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న రమప్రభను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దాదాపు వారిద్దరూ 14ఏళ్ల పాటు కలిసి ఉన్నారు. అయితే ఈ దంపతులకు పిల్లలు లేరు. ఇక శరత్ బాబు ఆస్తి విషయంలో తనను మోసం చేశాడు అని రమాప్రభ అతడికి విడాకులు ఇచ్చింది. తర్వాత నంబియార్ కూతురు స్నేహ నంబియార్ ను వివాహం చేసుకున్నారు. ఆమెతో కూడా ఎక్కువ కాలం జీవించలేక 2011లో విడాకులు తీసుకున్నాడు. ఇకపోతే ఆయనకు సంతానం కలగలేదు. మూడో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ చేసుకోలేకపోయారు. వారసులు లేకుండా ఆయనకు ఇప్పుడు తలకొరివి ఎవరు పెడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి శరత్ బాబు కుటుంబం చాలా పెద్దది.. ఏడుగురు అన్నదమ్ములు , అయిదుగురు అక్క చెల్లెలు.. వారి పిల్లలే సుమారుగా 25 మంది దాకా ఉన్నారు. ఇకపోతే ఈరోజు చెన్నైలో ఆయన అంత్యక్రియలను కుటుంబ సభ్యులు జరపనున్నారు. ఇక ఈ క్రమంలోనే తమ కుటుంబంలోని పిల్లల్లో ఎవరో ఒకరి చేత ఆయనకు తలకొరివి పెట్టించనున్నారట. ఇప్పటికే ఆముదాల వలస, ఇతర ప్రాంతాల నుంచి బంధువులు , కుటుంబ సభ్యులు, స్నేహితులు చేరుకున్నారు. ఇక ఈరోజు మధ్యాహ్నం శరత్ బాబు అంత్యక్రియలు జరగనున్నాయి.
Read Also:Ajith : అజిత్ కొత్త వ్యాపారం.. ఆల్ ది బెస్ట్ చెబుతున్న ఫ్యాన్స్
ఇది ఇలా ఉండగా.. చెన్నైలోని త్యాగరాయనగర్‌లో శరత్ బాబు నివాసానికి చేరుకున్నారు. అనంతరం శరత్‌బాబు భౌతికకాయం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఆయనతో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అనతరం మీడియాతో మాట్లాడుతూ.. మంచిమిత్రుడిని కోల్పోయానని చెప్పారు. నటుడు కాకముందే ఆయనతో తనకు పరిచయం ఉందని తెలిపారు. శరత్‌బాబు తనకు అత్యంత సన్నిహితుడని, తనపట్ల ఆప్యాయంగా ఉండేవారని చెప్పారు. ఆయన కోపంగా ఉండటం తానెప్పుడూ చూడలేదన్నారు. ఆయన నటించిన సినిమాలన్నీ పెద్ద హిట్ అయ్యాయని చెప్పారు. ఆయన మృతి తనను కలచివేసిందన్నారు. ముత్తూ, అన్నామలై సహా చాలా సినిమాలో తామిద్దరం కలిసి నటించామని తెలిపారు. సిగరెట్లు తాగొద్దని తనను వారించేవాడని, ఆరోగ్యంగా ఉండాలని చాలాసార్లు చెప్పారని గుర్తుచేసుకున్నారు.
#WATCH | Tamil Nadu | Actor Rajinikanth visited the residence of veteran actor Sarath Babu in Chennai to pay his last respects. Sarath Babu passed away yesterday. pic.twitter.com/6EickJCoDm
— ANI (@ANI) May 23, 2023
తాజావార్తలు
-
Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!