ఏటీఎంకు కొత్త నిర్వచణం చెబుతూ ఎనీ టైం మందు అంటూ ఓ సినిమాలో ఓ యాక్టర్ డైలాగ్ చెప్పిన విషయం గుర్తుందా? అది ఇప్పుడు నిజమైపోయింది.. అందేంటి? అదేలా ? అంటారా? అదేనండి బాబు.. ఇప్పుడు ఎనీ టైం మందు (ఏటీఎం)లు కూడా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.. ఏటీఎంలో కార్డు పెట్టి కావాల్సిన మొత్తాన్ని కొడితే క్యాష్ వచ్చినట్టుగానే.. ఏ లిక్కర్ కావాలో.. దానికి సరపడి డబ్బులు వేస్తే.. ఆ ఏటీఎం నుంచి మీకు నచ్చిన మందు వస్తుందన్నమాట..…
తమిళనాడులో దారుణం జరిగింది. బిజెపి నేత దారుణ హత్య గురయ్యారు. ప్రత్యర్ధులు కారుపై నాటు బాంబులతో దాడి చేసి నడిరోడ్డుపై చంపారు. గురువారం రాత్రి పూందిపలై హైవే నుండి కాంచీపురం వెళ్ళే చెక్ పోస్ట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు దిగి పరుగెత్తుకుంటూ వెలుతున్న బీజేపీ నేత శంకర్ ను వెంటాడి చంపారు.
Singara Chennai Card : చెన్నై తిరుమంగళం మెట్రో స్టేషన్లో సింగర చెన్నై కార్డు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణన్ పాల్గొని ఈ కార్డును పరిచయం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటించనున్నారు. చెన్నై విమానాశ్రయంలో మొత్తం రూ.2,437 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనంతో సహా పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు.
తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. ఢిల్లీ శ్రద్దావాకర్ హత్య కేసు తరహాలోనే చెన్నైలో ఓ యువకుడిని మాజీ ప్రియురాలి హత్య చేయడం సంచలనంగా మారింది. దారుణంగా హత్య చేయడమే కాకుండా 400 కిలోమీటర్ల దూరంలో మృతదేహాన్ని ముక్కలు చేసి పాతిపెట్టింది.
IIT-Madras PhD Student Dies By Suicide: దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటీ-మద్రాస్. ఎంతో మందిని గొప్పవారిని దేశానికి అందించింది. అయితే ఇటీవల మాత్రం తరుచు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మద్రాస్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పీహెచ్డీ చేస్తున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన 32 ఏళ్ల విద్యార్థి సచిన్ వేలచ్చేరిలోని తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అనుమానం పెను భూతమైంది.. అని చాలా సార్లు చదివే ఉంటాం. ఈ సంఘటనలోనూ ఆ అనుమానమే.. ఏడాదైనా నిండని పసి కందు పాలిట యమ పాశమైంది. భార్యపై పెంచుకున్న అనుమానమే... ఆ బాలుడి ఉసురు తీసింది.
నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు మర్రిపాడులోని తన నివాసంలో వైద్యులు చికిత్స చేశారు. అనంతరం మర్రిపాడు నుంచి చికిత్స కోసం నెల్లూరులోని ఆసుపత్రికి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బయలుదేరారు.అక్కడి నుంచి చెన్నైకి తరలించే అవకాశం ఉంది.
కస్టమ్స్ విభాగానికి చెందిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ చెన్నై విమానాశ్రయంలో 56 లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీని సిఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది సీజ్ చేసింది. సింగపూర్ వెళ్లేందుకు చెన్నై ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఇద్దరి ప్రయాణీకుల లగేజ్ బ్యాగ్ లను సిఐఎస్ఎఫ్ స్కానింగ్ చేయగా షాక్ కు గురయ్యారు.
World Idli Day: భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం. ప్రాంతాల వారీగా ప్రజలు ఆచారాలు, ఆహారపు అలవాట్లు, భాష, కట్టుబొట్టు మారుతుంటాయి. ముఖ్యంగా ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో వంటల్లో భిన్నత్వం కనిపిస్తుంటుంది. దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా బియ్యం ప్రధానంగా ఉంటే ఇడ్లీలు, దోశెలు, ఊతప్ప ఇలాంటి టిఫిన్స్ కు ప్రాధాన్యత ఇస్తుంటారు. ముఖ్యంగా అల్పహారంలో ఇడ్లీలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ ఏడాది మార్చి 30ని ‘‘అంతర్జాతీయ ఇడ్లీ దినోత్సవం’’గా…