Minister Roja: మినిస్టర్ రోజా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. రోజామోకాలి నొప్పితో బాధపడుతుందని.. ఆ నొప్పి మరింత తీవ్రతరం కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించినట్లు తెలుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఆమె కుటుంబంతో ఎంతో హ్యాపీగా గడిపారని, సడెన్ గా ఆమె కాలు నొప్పితో పాటు వాయడం కూడా జరిగిందని.. అందుకే భయపడి కుటుంబ సభ్యులు చెన్నెలోని అపోలో కి తరలించారట. ప్రస్తుతం రోజా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.
Samantha: సమంత నాటకాలాడుతోంది.. ఏకిపారేస్తున్న ట్రోలర్స్
రోజాను పరీక్షించిన వైద్యులు ఆమెకు చికిత్స అందించి రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే రోజా అస్వస్థకు గురైందనే వార్తలతో వైసీపీ కార్యకర్తలు అభిమానులు ఆందోళనకు గురయ్యారు. వారు రోజా త్వరగా కోరుకోవాలని దేవుడ్ని కోరుకుంటున్నారు. ఇక అభిమానులు సైతం రోజా అనారోగ్యం వార్తలు విని ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ట్వీట్స్ చేస్తున్నారు. ఇకపోతే రోజా ప్రస్తుతం వైసీపీ మినిస్టర్ గా విధులు నిర్వహిస్తుంది. రెండు సార్లు నగరి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా .. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక మరియు యువజనాభివృద్ధి శాఖ మంత్రిగా కొనసాగుతోంది.