Chennai: అది మామూలు గ్యాంగ్ కాదు.. కంత్రీ.. కంజర భట్ గ్యాంగ్. స్కెచ్ వేస్తే పంట పండాల్సిందే. ఆంధ్రా, బెంగళూరు, చెన్నై ట్రయాంగిల్ ప్లేస్ లో ఏకకాలంలో కంటైనర్లను ధ్వంసం చేస్తున్న ఈ హైజాక్ గ్యాంగ్ ఖాకీలకు సవాల్ గా మారింది. చిత్తూరు జిల్లా పోలీసుల సహకారంతో తమిళనాడు అధికారులు ఈ ముఠాను పట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అయినా కూడా దక్షిణాది రాష్ట్రాల్లో సెల్‌ఫోన్ కంటైనర్లను టార్గెట్ చేస్తున్న ఉత్తరాది ముఠా పోలీసులకు చిక్కుముడి తెచ్చిపెడుతోంది.
Read Also:Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. తిరుపతి అందాలను తిలకించేందుకు హెలికాప్టర్ రైడ్
ఏపీ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో నమోదైన కేసులను డీల్ చేయడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ క్రమంలోనే ఉత్తరాది యాత్రకు వెళ్లి తమిళనాడు యాత్రికులకు కంజరభట్ గ్యాంగ్ షాక్ ఇచ్చింది. తమిళనాడు వాసులు కోయంబత్తూరు నుండి బస్సులో ఉత్తరాది యాత్రకు బయలుదేరారు. శిరిడి వెళ్ళి బస్సు దిగగానే యాత్రికులు షాక్ కు గురయ్యారు. బస్సు పై భాగంగా ఉంచిన కొన్ని లగేజ్ బ్యాగులు, అందులోని నగదును గ్యాంగ్ కొట్టేసింది. అతివేగంగా వెలుతున్న రన్నింగ్ బస్సును వెనుకనుండి పైకి ఎక్కి దొంగతనం చేసింది గ్యాంగ్. ఈ దృశ్యాలన్నీ బస్సు సిసిటివిలో రికార్డయ్యాయి.
Read Also:New York City: న్యూయార్క్ లో ఆరెంజ్ కలర్ లోకి మారిన ఆకాశం