మరికొద్దిరోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుండగా మహేంద్ర సింగ్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ అధికారికంగా తప్పుకున్నాడు. ఈ మేరకు తన సారథ్య బాధ్యతలను ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు అప్పగిస్తున్నట్లు అతడు ప్రకటించాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ధోనీ 204 మ్యాచుల్లో చెన్నైకు సారథ్యం వహించగా ఆ జట్టు 121 విజయాలు సాధించింది. నాలుగు సార్లు టైటిల్ గెలిచింది. అంతేకాకుండా 9 సార్లు ఫైనల్…
ఐపీఎల్‌లో సురేష్ రైనాకు అద్భుతమైన రికార్డు ఉంది. చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున అతడు గుర్తుండిపోయేలా ప్రదర్శనలు చేశాడు. అయినా ఈ ఏడాది అతడు ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సురేష్ రైనాకు అరుదైన గౌరవం దక్కింది. మాల్దీవులు ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘స్పోర్ట్స్ ఐకాన్’ అవార్డుకు రైనా ఎంపికయ్యాడు. ఈ అవార్డు కోసం 16 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు పోటీపడగా చివరకు సురేష్ రైనాను వరించింది. ఈ అవార్డు కోసం…
ఐపీఎల్-15 సీజన్ ప్రారంభానికి ముందే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగనున్న తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. ఎందుకంటే మొయిన్ అలీకి వీసా సమస్యలు వచ్చిపడ్డాయి. దీంతో అతడు ఇండియా రావడానికి ఇప్పటిదాకా వీసా లభించలేదని తెలుస్తోంది. మొయిన్ అలీ ప్రస్తుతం ఇంకా ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు. ఈ అంశంపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్…
మరికొద్దిరోజుల్లో ఐపీఎల్ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్‌కింగ్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టింది. అయితే నెట్ బౌలర్‌గా ఐర్లాండ్ బౌలర్ జోష్ లిటిల్‌ను చెన్నై జట్టు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని క్రికెట్ ఐర్లాండ్ స్వయంగా వెల్లడించింది. ఈ లెఫ్టార్మ్ పేసర్‌కు ఈ అవకాశం మంచి అనుభవంగా మారాలని క్రికెట్ ఐర్లాండ్ ఆకాంక్షించింది. జోష్ లిటిల్ త్వరలో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగనున్నాడు.…
క్రికెట్ అభిమానులకు బీసీసీఐ అదిరిపోయే వార్త అందించింది. బీసీసీఐ పాలకమండలి ఆదివారం సాయంత్రం ఐపీఎల్ 2022 పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. మార్చి 26న ఈ మెగా లీగ్ ప్రారంభం కానుంది. కరోనా పరిస్థితుల కారణంగా భారత్‌లోని రెండే నగరాల్లో లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబైలోని మూడు స్టేడియాలు, పూణెలోని ఓ స్టేడియంలో ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఐపీఎల్-15లో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు, నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి. మొత్తం 65 రోజుల పాటు…
ఐపీఎల్ 15వ సీజన్ కోసం కొత్త ఫార్మాట్‌ను నిర్వాహకులు అమలు చేయబోతున్నారు. ఈ ఏడాది జట్ల సంఖ్య 8 నుంచి 10కి పెరగడంతో మ్యాచ్‌ల సంఖ్యను తగ్గించేందుకు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. కానీ ఎప్పటిలాగే గ్రూప్ దశలో ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లు ఆడనుంది. కొత్త ఫార్మాట్ వివరాలను బీసీసీఐ ప్రకటించింది. గ్రూప్-ఎలో ముంబై, కోల్‌కతా, రాజస్థాన్, ఢిల్లీ, లక్నో ఉన్నాయి. గ్రూప్-బిలో చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పంజాబ్, గుజరాత్ జట్లు ఉన్నాయి. ఎక్కువ ట్రోఫీలు…
ఐపీఎల్ మెగా వేలంలో సురేష్ రైనాను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. గత 14 ఏళ్లుగా రైనా చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ఆడి ఎన్నో విజయాలను ఒంటిచేత్తో అందించాడు. ఈ నేపథ్యంలో రైనాను తీసుకోకపోవడంపై సీఎస్కే అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో కామెంట్లు, పోస్టులతో తమ బాధను వెళ్లగక్కుతున్నారు. కరోనా కారణంగా 2020 సీజన్‌లో రైనా ఆడకపోయినా 2021 సీజన్‌లో అంచనాల మేరకు రాణించలేకపోయాడు. అయితే ఒక సీజన్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని అతడిని వేలంలో కొనుగోలు…
రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్-2022 మెగావేలం ముగిసింది. ఈ వేలంలో మొత్తం 204 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. వీరిలో 67 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. 204 మంది ఆటగాళ్ల కోసం అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ.551.7 కోట్లను ఖర్చు చేశాయి. ఈ ఐపీఎల్ వేలంలో ఇషాన్ కిషన్ అత్యధిక ధర పలికాడు. అతడి కోసం ముంబై ఇండియన్స్ రూ.15.25 కోట్లను ఖర్చు చేసింది. రెండో స్థానంలో దీపక్ చాహర్ నిలిచాడు. అతడిని చెన్నై సూపర్‌కింగ్స్…
టీమిండియా ఆల్‌రౌండర్ శివం దూబే ఆదివారం నాడు రెండు గుడ్ న్యూస్‌లు అందుకున్నాడు. అతడు ఆదివారం తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ముంబై వాసి శివం దూబే గత ఏడాది గర్ల్‌ఫ్రెండ్ అంజుమ్ఖాన్ను వివాహం చేసుకున్నాడు. ఆదివారం అంజుమ్ మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో శివం దూబే తన భార్య, కొడుకు ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. మరోవైపు ఐపీఎల్ మెగా వేలంలో శివం దూబేను రూ.4 కోట్లకు చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు సొంతం చేసుకుంది. ఇలా ఒకేరోజు రెండు…