రంజాన్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా ఈద్ సంబరాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు కూడా ఈద్ సంబరాలను నిర్వహించింది. ఈ క్రమంలో చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ, మొయిన్ అలీ, డ్వేన్ బ్రావో, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లు ఈద్ సంబరాల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను చెన్నై సూపర్‌కింగ్స్ యాజమాన్యం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో కొంతమంది చిన్నారులతో ధోనీ సరదాగా గడపడం…
పూణె వేదికగా ఆదివారం రాత్రి ఐపీఎల్‌లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్లు రుతురాజ్ గైక్వాడ్ (99), కాన్వే (85 నాటౌట్) మెరుపుల కారణంగా 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అయితే చెన్నై నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు…
పూణె వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ రెచ్చిపోయింది. బలమైన బౌలింగ్ దళం కలిగి ఉంటుందని పేరున్న సన్‌రైజర్స్ జట్టుపై ఏకంగా 200 పరుగులకు పైగా స్కోర్ సాధించింది. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ మినహా మిగతా వారంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో చెన్నై టీమ్ 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. అతడు 57 బంతుల్లో 6 ఫోర్లు,…
చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కెప్టెన్‌గా మళ్లీ ఎంఎస్ ధోనీ రంగంలోకి దిగారు… ఈ సీజన్‌లో ఇప్పటికే 8 మ్యాచ్‌లు ఆడిన చెన్నై.. 6 పరాజయాలను చవిచూసింది.. రెండు మాత్రమే గెలిచింది.. ఒక్కప్పుడు తిరుగులేని విజయాలతో దూసుకుపోయిన ఆ జట్టు.. ఈ సీజన్‌లో డీలా పడడం.. ఆ జట్టు అభిమానులు, ముఖ్యంగా ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో కెప్టెన్‌గా ఉన్న రవీంద్ర జడేజాపై విమర్శలు పెరిగాయి.. దీంతో.. ఆటపై కూడా దృష్టిపెట్టలేకపోతున్నాడట.. వరుస ఓటములతో…
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే తాజాగా ఓ ఇంటి వాడయ్యాడు. కాన్వే న్యూజిలాండ్ క్రికెటర్ అయినా అతడి సొంత దేశం దక్షిణాఫ్రికా. అక్కడే పుట్టి పెరిగాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్ మాత్రం న్యూజిలాండ్ తరఫున ఆడుతున్నాడు. న్యూజిలాండ్ ఓపెనర్‌గా కాన్వే రాణిస్తుండటంతో చెన్నై సూపర్‌కింగ్స్ ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో రూ.కోటికి కోనుగోలు చేసింది. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. అయితే ఒక మ్యాచ్ మాత్రమే ఆడిన…
వీకెండ్ సందర్భంగా ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నై సూపర్‌కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లూ ఇప్పటివరకు టోర్నీలో బోణీ కొట్టలేదు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడి చెన్నై హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకోగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైంది. దీంతో ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం కానుంది. సన్‌రైజర్స్ టీమ్ కూర్పుపై విమర్శలు వస్తుండటంతో ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విలియమ్సన్…
చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మరో యువ ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌తో పంజాబ్ తరఫున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన వైభవ్ అరోరా అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా బౌలింగ్‌లో తన స్వింగ్‌తో చెన్నై టాప్ ఆర్డర్‌ను వణికించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అరోరా 21 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న చెన్నై ఆటగాళ్లు రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీలను పెవిలియన్…
ఐపీఎల్‌లో ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయినా లివింగ్ స్టోన్ విధ్వంసంతో పంజాబ్ జట్టు కోలుకుంది. ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా లివింగ్ స్టోన్ చెలరేగాడు. అంతేకాకుండా ముఖేష్ చౌదరి వేసిన ఓవర్లో 108 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే పెద్ద సిక్సర్. ముంబై ఇండియన్స్ ఆటగాడు బట్లర్ 104 మీటర్ల సిక్స్…
ఐపీఎల్‌లో కీలక మ్యాచ్‌కు చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్ సిద్ధమైంది. కాసేపట్లో పంజాబ్ కింగ్స్ టీమ్‌తో ఆడబోయే మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై టీమ్ ఫీల్డింగ్ వైపు మొగ్గు చూపింది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ చెన్నై సూపర్ కింగ్స్ పరాజయం పాలైంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ సీజన్లోకి అడుగుపెట్టిన ఆ టీమ్‌కు వరుస పరాజయాలు షాకిచ్చాయి. ముఖ్యంగా బౌలింగ్‌లో జడేజా నేతృత్వంలోని జట్టు బలహీనంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు క్రిస్ జోర్డాన్‌ను తుది…