Emergency Landing: మదురై నుంచి దుబాయ్ వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానం (SG23) సోమవారం మధ్యాహ్నం గగనతలంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులను భయాందోళనలకు గురిచేసింది. వెంటనే స్పందించిన పైలట్లు విమానాన్ని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి, అక్కడ అత్యవసర ల్యాండింగ్ (Emergency Landing) చేశారు. ఈ ఘటన సమయంలో విమానంలో మొత్తం 160 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది (మొత్తం 167 మంది) ఉన్నారు. ప్రయాణం మధ్యలో సమస్యను గుర్తించిన పైలట్లు, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా…
Air India: ఎయిర్ ఇండియా ఇటీవల వరస ప్రమాదాలతో సతమతమవుతోంది. సాంకేతిక సమస్యలు, పక్షుల తాకిడి వంటి ఘటనలు రిపీట్ అవుతున్నాయి. తాజాగా, కొలంబో నుంచి చెన్నై వస్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని పక్షి ఢీకొట్టింది. దీంతో అధికారులు విమానాన్ని రద్దు చేయాల్సి వచ్చింది.
ఎంత నిఘా పెట్టినా.. ఎంత కట్టడి చేసినా.. స్మగ్లర్లు తమ దందా సాగిస్తూనే ఉన్నారు. రోజు రోజుకు కొత్త తరహాలో దందా నిర్వహిస్తున్నారు. ఇలాగే చెన్నై ఎయిర్ పోర్టులో ఇద్దరు స్మగ్లర్లు.. ఏకంగా 56 కిలోల కొకైన్‌తో పట్టుబడ్డారు. వారు కొకైన్‌ను తీసుకు రావడానికి ఉపయోగించిన విధానం చూసి కస్టమ్స్ అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ ఆ స్మగ్లర్లు కొకైన్ ఎలా తీసుకొచ్చారు?ఇక్కడ.. గోల్డ్ కలర్ డబ్బాల్లో ఏముందో తెలుసా? అరె.. ఇదేదో చాక్లెట్ డబ్బాలా…
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి పీఏ పైలా దిలీప్‌ను చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. చెన్నై నుంచి విదేశాలకు పరారయ్యేందుకు ప్రయత్నిస్తుండగా.. దిలీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిలీప్‌ను ఈరోజు రాత్రికి విజయవాడకు తీసుకొచ్చే అవకాశం ఉంది. రాజ్ కసిరెడ్డి పీఏ వద్ద కీలక ఆధారాలు ఉన్నట్లు సిట్ బృందాలు భావిస్తున్నాయి. ఏపీ మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడు రాజ్…
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో నాలుగు అంతర్జాతీయ విమానాలు ల్యాండింగ్ అయ్యాయి. అందుకు కారణం.. వాతావరణం అనుకూలించకపోవడం. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో వాతావరణం అనుకూలించకపోవడం కారణంగా అక్కడికి వెళ్లే విమానాలను శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు దారి మళ్లించారు అధికారులు.
Vasi Zakariya: పాకిస్థాన్ దేశంలోని ఖలీఫా సంస్థ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న వరంగల్ వాసి జకర్యను పోలీసులు మద్రాసు ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. 25 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ నుండి భారత్‌కు వచ్చిన జకర్య తొలుత ఎనిమిది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో జీవనం కొనసాగించాడు. అనంతరం తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని జాన్‌పీరీలు ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్నాడు. వరంగల్ జిల్లాలో స్థిరపడిన జకర్య, అండర్ బ్రిడ్జి ప్రాంతంలో ఒక బిర్యానీ సెంటర్‌ను నిర్వహిస్తూ జీవనం…
చెన్నై ఎయిర్‌పోర్టులో అర్ధరాత్రి హై టెన్షన్ నెలకొంది. టేకాఫ్ అయిన విమానంలో ఇద్దరు ప్రయాణికులు తమ వద్ద బాంబు ఉందని, పేల్చేవేస్తామంటూ బెదిరించారు. దాంతో విమానంలో ఏం జరుగుతుందో తెలియక తోటి ప్రయాణికులు భయంతో వణికిపొయారు. చెన్నై ఎయిర్‌పోర్టులో విమానాశ్రయం ల్యాండ్ అయిన వెంటనే అధికారులు తనిఖీలు చేసి బాంబులేదని నిర్ధారించారు. ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి కొచ్చి నుంచి చెన్నైకి 171 మంది ప్రయాణికులతో ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్యాసింజర్ విమానం…
Fishermen Released: శ్రీలంక జైలు నుంచి విడుదలైన 15 మంది భారతీయ మత్స్యకారులు గురువారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. సముద్రంలో అంతర్జాతీయ సరిహద్దులు దాటుకొని వెళ్లి చేపలు పట్టినందుకు మత్స్యకారులను అరెస్టు చేశారు. తమిళనాడు మత్స్యశాఖ అధికారులు విమానాశ్రయంలో వారికి స్వాగతం పలికి స్వగ్రామాలకు పంపించారు. ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, ఎనిమిది మంది మత్స్యకారుల బృందం 2024 సెప్టెంబర్ 27న మన్నార్ ద్వీపం ప్రాంతానికి సమీపంలో చేపలు వేడుతుండగా, శ్రీలంక నావికాదళం సరిహద్దు దాటి చేపలు…
Drugs Seized: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్, గంజాయి, బంగారాన్ని పట్టుకున్నారు ఎయిర్ పోర్ట్ అధికారులు. ఇందులో భాగంగా 14.2 కోట్ల విలువ చేసే కోకైన్, 76 లక్షల విలువ చేసే విదేశీ గంజాయి, 1.75 కోట్ల విలువ చేసే 1.78 కేజీల బంగారం సీజ్ చేసారు కస్టమ్స్ అధికారులు. అధికారులు పట్టుకున్న కొకైన్ ను క్యాప్సూల్స్ లో నింపి పొట్టలో దాచింది లేడి కిలాడి. అదికూడా ఏకంగా 76 క్యాప్సూల్స్ మింగింది కెన్యా జాతీయురాలు.…
తన కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆంజనేయులును హత్య చేసిన ఆంజనేయ ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. చెన్నై ఎయిర్‌పోర్టులో ఆయనను కడప పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.