విమానాశ్రయాలు గోల్డ్ స్మగ్లింగ్‌కు అడ్డాలుగా మారుతున్నాయి. బంగారం అక్రమ రవాణాకు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తూ బంగారాన్ని తరలిస్తున్నారు. అయితే కస్టమ్స్ అధికారుల ముందు బంగారం స్మగ్లర్ల ఆటలు సాగడం లేదు.
తమిళనాడులోని చెన్నై, మహరాష్ట్రలోని ముంబయి ఎయిర్ పోర్టుల్లో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. చెన్నైలో 2.1 కోట్ల విలువ చేసే 4.5 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.
చెన్నై విమానాశ్రయంలో ఏకంగా ‘ వీడొక్కడే ’ సినిమా సీన్ రిపీట్ అయింది. సినిమాలో డ్రగ్స్ ను క్యాప్సుల్స్ లో పెట్టి కడుపులో దాచిన సన్నివేశం ఉంటుంది. సరిగ్గా అలాగే టాాంజానియా నుంచి వస్తున్న వ్యక్తి కడుపులో రూ. 8.86 కోట్ల విలువైన 1.266 కిలోల హెరాయిన్ కనుగొన్నారు. మొత్తం 86 క్యాప్సుళ్లను కడుపులో దాచాడు. చెన్నై ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని పరీక్షించగా కడుపులో ఉన్న డ్రగ్స్ గుట్టు తెలిసింది.
కేటుగాళ్లు రోజురోజుకు మితిమీరిపోతున్నారు. కొత్తకొత్త ఐడియాలతో స్మగ్లింగ్ పాల్పడుతున్నారు. చివరికి కస్టమ్స్ అధికారులకు చిక్కి జైలు పాలవుతున్నారు. అయితే తాజాగా మరో వ్యక్తి బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు కొత్తగా ఆలోచించి.. చివరికి అరెస్ట్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. సౌదీఅరేబియా నుంచి ఓ వ్యక్తి చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. అయితే అతడిపి అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు.. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని తనతో పాటు తన వెంట తెచ్చుకున్న బ్యాగ్‌లలో కూడా తనిఖీలు చేశారు. అయితే తనవద్ద…
మాదక ద్రవ్యాలను రవాణా చేసేందుకు స్మగ్లర్లు కొత్త కొత్త పంథాలను వెతుకుతున్నారు. స్మగ్లర్లు ఎన్ని ప్లాన్లు చేసిన కస్టమ్స్ అధికారులు తిప్పికొడుతున్నారు. అలాంటి ఘటనే ఇది .. ఉగాండా దేశానికి చెందిన జూడిత్ అనే వ్యక్తి భారీగా హెరాయిన్ తరలించేందుకు ప్లాన్ చేసాడు. కస్టమ్స్ అధికారులను ఏమార్చి మాదక ద్రవ్యాలను తరలించేందుకు పథకం పన్నాడు. దాని కోసం కేటుగాడు 7 కోట్ల విలువ చేసే హెరాయిన్ ను కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా హెరాయిన్ ను…
చెన్నై ఎయిర్‌పోర్డ్‌లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. దుబాయ్ ప్రయాణీకుల వద్ద రూ.55.29 లక్షల విలువ చేసే యూఎస్ డాలర్స్, దిర్హమ్స్, దినార్స్, రియాల్స్‌ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ వెళుతున్న ముగ్గురు ప్రయాణీకులు కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా, విదేశీ కరెన్సీని ట్రాలీ బ్యాగ్‌కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జిప్‌లో దాచి కేటుగాళ్లు తరలించేందుకు ప్రయత్నించారు. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన స్కానింగ్ లో విదేశీ కరెన్సీ బాగోతం బయటపడింది. దీంతో కరెన్సీ సీజ్…
తమిళనాడులోని చైన్నై ఎయిర్‌పోర్టులో భారీగా డైమండ్స్‌ను పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఓ దుబాయ్ ప్రయాణీకుడి వద్ద నుంచి 5.76 కోట్ల విలువ చేసే వజ్రాలను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఆ ప్రయాణికుడిని అరెస్టు అధికారులు అరెస్టు చేశారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా వజ్రాలను ట్రాలీ బ్యాగ్ కింది భాగంలో దాచి, వజ్రాలను దాచిన ట్రాలీ బ్యాగ్‌తో దుబాయ్‌కు వెళ్లేందుకు యత్నించిన ప్రయాణికుడు. ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారుల స్కానింగ్‌లో బండారం బట్టబయలైంది. Read Also:174…
మరోసారి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణీకుల వద్ద 1.13 కోట్ల విలువ చేసే 1.42 కేజీల బంగారం తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులను కస్టమ్స్ అధికారు సీజ్ చేశారు. కస్టమ్స్ అధికారులను బురడి కొట్టించడానికి బంగారాన్ని కార్టన్ బాక్స్ మధ్య భాగంలో దాచి కేటుగాళ్లు తరలించేందుకు యత్నించారు. అయితే 5 మంది ప్రయాణీకుల కదలికలపై అనుమానంతో కస్టమ్స్ బృందం వారిని అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తమదైన…
స్మగ్లర్లు ఏ అవకాశాన్నీ వదలడం లేదు. వివిధ వస్తువుల్లో బంగారాన్ని దాచి మరీ దేశంలోకి ఎంటరవుతున్నారు. ఎయిర్ పోర్టుల్లో తనిఖీల్లో అడ్డంగా బుక్కవుతున్నారు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో అక్రమ బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. కొలంబో ప్రయాణీకుడి వద్ద 40.28 లక్షల విలువ చేసే 928 గ్రాముల బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. సినీ పక్కీలో బంగారాన్ని పేస్టు గా మార్చి కాళ్లకు వేసుకునే చెప్పుల్లో దాచి తరలించే యత్నం చేశాడో కేటుగాడు.…