Vasi Zakariya: పాకిస్థాన్ దేశంలోని ఖలీఫా సంస్థ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న వరంగల్ వాసి జకర్యను పోలీసులు మద్రాసు ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. 25 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ నుండి భారత్‌కు వచ్చిన జకర్య తొలుత ఎనిమిది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో జీవనం కొనసాగించాడు. అనంతరం తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని జాన్‌పీరీలు ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్నాడు. వరంగల్ జిల్లాలో స్థిరపడిన జకర్య, అండర్ బ్రిడ్జి ప్రాంతంలో ఒక బిర్యానీ సెంటర్‌ను నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. సాధారణ జీవితం సాగిస్తున్నట్లు కనిపించినా అతనికి పాకిస్తాన్‌కు చెందిన ఖలీఫా అనే సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఖలీఫా సంస్థను పాకిస్తానీలో ప్రారంభించిన వ్యవస్థాపకుడు ఇటీవల మృతి చెందడంతో ఆ సంస్థకు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ జరుగుతోంది.
Also Read: Shah Rukh Khan: సౌత్ స్టార్‌లు ఆ విషయంలో కొంచెం తగ్గితే మంచిది : షారుఖ్ ఖాన్
ఈ నేపథ్యంలో, కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం జకర్య శ్రీలంకకు వెళ్లే ప్రయత్నం చేస్తున్న సమయంలో మద్రాసు ఎయిర్‌పోర్టులో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సంస్థకు భారతదేశ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న జకర్యపై దర్యాప్తు కొనసాగుతోంది. అతనికి ఖలీఫా సంస్థతో ఉన్న అనుబంధం, కార్యకలాపాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. జకర్య వ్యవహారంపై మరింత సమాచారం కోసం విచారణ కొనసాగింపు చర్యలు సాగుతున్నాయి. అతని అరెస్ట్ ప్రస్తుతం సంచలనం రేపుతోంది. భారతదేశ భద్రతా సంస్థలు ఈ వ్యవహారంపై కూడా దృష్టి పెట్టాయి.