Matrimonial fraud: ఇటీవల కాలంలో మ్యాట్రిమోనియల్ మోసాలు పెరుగుతున్నాయి. గతంలో పెద్దలు కుదర్చిన పెళ్లిళ్లు ఉంటే, ఇప్పుడు మాత్రం అమ్మాయిలు, అబ్బాయిలు తమకు నచ్చిన సంబంధాలను మ్యాట్రిమోని సైట్లలో వెతుక్కుంటున్నారు. ఇదే మోసగాళ్లకు వరంగా మారింది. తాజాగా రాజస్థాన్‌కి చెందిన 45 ఏళ్ల వ్యక్తి ఒకర్నికాదు ఇద్దర్ని కాదు ఏకంగా 250 మందికి పైగా మహిళల్ని మోసం చేశాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు యూనియన్ బ్యాంకు శాఖ మేనేజరుగా పనిచేస్తున్న దావులూరి ప్రభావతిపై పెనమలూరు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. బ్యాంక్ మేనేజర్ బ్యాంకులో కుదువ పెట్టిన బంగారంతో వడ్డాణం చేయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తమిళ స్టార్ హీరో రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్ పై గత కొన్నేళ్లుగా చెన్నైకి చెందిన యాడ్ ఏజెన్సీ కంపెనీ న్యాయ పోరాటం చేస్తోంది.. ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కించిన కొచ్చాడియాన్ సినిమా ప్రొడక్షన్ సమయంలో .. యాడ్ ఏజెన్సీ కంపెనీ నుంచి తీసుకున్న ఋణం..తిరిగి ఇవ్వకపోవడంపై లతా రజినీకాంత్పై చీటింగ్ కేసు నమోదయ్యింది.. దీంతో ఈ కేసు పై అప్పటి నుంచి విచారణ జరుగుతూనే ఉంది.. దీనిపై పెద్ద చర్చే జరిగింది.. ఇక ఇది కాస్త బెంగళూరులోని…
Hyderabad: సన్ బర్న్ ఈవెంట్ నిర్వహకులపై మదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ మాదాపూర్‌లో నిర్వహించ తలపెట్టిన సన్‌బర్న్ కార్యక్రమాన్ని రద్ద చేశారు. బుక్‌మై షోలో ఈ ఈవెంట్‌కు సంబంధించి టికెట్ల విక్రయాన్ని కూడా నిలిపివేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఈవెంట్ నిరర్వహించాలని చూసిన నిర్వహకుడు సుశాంత్ అలియాస్ సుమంత్‌పై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. అసలు ఈవెంట్‌కు అనుమతి తీసుకోకుండానే సుశాంత్ బుక్ మై షోలో సన్…
ఉత్తర కేరళలోని కన్నూర్ జిల్లాలో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌తో పాటు మరో ఇద్దరిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని కొల్లూరులో క్రికెటర్ శ్రీశాంత్ స్పోర్ట్స్ అకాడమీని నిర్మిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈరోజుల్లో ఎవరిని నమ్మడానికి వీలు లేదు.. ఆ మాటకొస్తే మన నీడను కూడా నమ్మడానికి వీలు లేదు.. ప్రేమ పేరుతో చాలా మంది మోసపోతున్నారు.. కిలాడీలు ప్రేమ పేరుతో వల వేసి సమయం దొరికితే అసలు రంగు బయటపెడుతూ దారుణంగా మోసం చేస్తున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి..తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. ఓ మహిళ ప్రేమ పేరుతో దగ్గరయ్యింది.. పార్టీ పేరుతో పిలిచింది.. నమ్మి వెళ్తే నట్టేట ముంచింది. ఉన్నదంతా లాగేసుకుంది. పైగా…