సినీ పరిశ్రమలో ఎవరిని నమ్మలేము.. వారు ఎప్పుడు ఎలా మోసం చేస్తారో ఎవరికి తెలియదు. తాజాగా ఒక జూనియర్ ఆర్టిస్ట్ ని ఒక వ్యక్తి దారుణంగా మోసం చేశాడు. తనను ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి మొదటి భర్తకు విడాకులిప్పించి, తన కోరిక తీర్చుకున్నాకా వదిలేశాడని జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. రహ్మత్‌నగర్‌లో నివాసముంటున్న ఒక యువతి(26) సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తోంది. ఆమెకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారికి నాలుగేళ్ల కొడుకు…
చీటింగ్ కేసులో సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావును రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. నానక్‌రాంగూడలోని సర్వే నెంబర్ 104లో శ్రీధర్ రావుకు ఐదు ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి సంబంధించిన అంశంలో మమ్మల్ని మోసం చేశాడంటూ రాయదుర్గం పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఆ భూమి అమ్మకం జరిగినప్పుడు తమకు రావాల్సిన అమౌంట్ ఇవ్వకుండా మోసం చేశాడని, డబ్బులు అడిగితే గన్‌మెన్‌లను చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడని, చంపుతామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. కొందరికి…
దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్లు తీసుకున్నాడు మోసగాడు. ఒడిస్సా కు చెందిన సంబంధ్ ఫిన్‌సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సీఈఓ, ఎండీ దీపక్ కిండో అరెస్ట్ అయ్యారు. నాబార్డ్ కు 5 కోట్లు లోన్ తీసుకున్న దీపక్… తిరిగి మూడు కోట్లు చెల్లించిన స్నేహితుడు మరో రెండు కోట్లుకు టోపి పెట్టడంతో.. నాబార్డ్ అధికారి ఫిర్యాదుతో…
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు, కృష్ణ జింకలు వేటాడిన కేసు… ఇలా సల్మాన్ ఖాన్ కు పోలీస్ పిలుపులు, కోర్టు కష్టాలు కొత్తేం కాదు. కానీ, ఈసారి అతడి చెల్లెలు అల్వీరా ఖాన్ కూడా చిక్కుల్లో పడింది. ఛంఢీఘర్ లోని ఒక లోకల్ బిజినెస్ మ్యాన్ స్థానిక పోలీసుల్ని ఆశ్రయించాడు. ‘బీయింగ్ హ్యూమన్’ బ్రాండ్ నేమ్ తో సల్మాన్ సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. అదే పేరుతో జ్యుయెలరీ అమ్మటం కూడా చేస్తుంటారు. ఛంఢీఘర్ లోని బిజినెస్ మ్యాన్…
ప్రేమ, పెళ్లి పేరుతో అమాయకులకు బురిడీ కొట్టిసున్న మాయ లేడీ శ్రీదివ్యపై పోలీస్ కేసు నమోదు అయింది.. ఆమెతో పాటు తమ్ముడు పోతురాజు, ఆమెకు సహకరిస్తున్న రజాక్ లపై బాధితుడు విజయవాడలోని ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి చేసుకుంటాను అంటూ ఆ యువకుడి నుంచి 80 లక్షలు కొట్టేసింది. డబ్బులు వసూలు చేశాక ఆ మహిళ ముఖం చాటేస్తోంది. కాగా మాయలేడీ మోసాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆమె చేతిలో ఇలానే మోసపోయిన పలువురి వద్ద…