Ram Gopal Varma: రామ్ గోపాల వర్మ వివాదాలను వెతుక్కోవడం పోయి.. ఆయనకే వివాదాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు నిర్మాత నట్టి కుమార్, వర్మపై చీటింగ్ కేసు పెట్టిన విషయం విదితమే.
Kannada Actor Veerendra Babu: ప్రముఖ కన్నడ నటుడు, నిర్మాత వీరేంద్ర బాబు అరెస్ట్ అయ్యాడు. పార్టీ తరపున తనకు టికెట్ ఇస్తానని చెప్పి తన వద్ద రూ.1.88 కోట్లు తీసుకొని మోసం చేశాడని బసవరాజా గోసాల్ అనే వ్యక్తి బెంగుళూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వీరేంద్ర బాబును అరెస్ట్ చేశారు.
తనని తాను విష్ణువుగా ప్రకటించుకున్న అనంత విష్ణు ప్రభు అలియాస్ రామ్‌దాస్‌పై హైదరాబాద్ సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 420, 290,341 కింద పబ్లిక్ న్యూసెన్స్, చీటింగ్, రోడ్ అబ్స్‌ట్రాక్షన్ కేసుల్ని నమోదు చేయడం జరిగింది. అలాగే.. అతను పెట్టిన జై మహా భారత్ పార్టీ రిజిస్టర్‌పై కూడా సైఫాబాద్ పోలీసులు ఈసీకి లేఖ రాశారు. ఇళ్ల స్థలాల మాటున భారీఎత్తున ఆధార్ కార్డులు సేకరించడంపై ఈ కేసులు నమోదు చేసినట్టు తేలింది.…
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ వార్తల్లో వుంటారు. తాజాగా ఆయనపై చీటింగ్ కేసు నమోదైంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పైన మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఈ చీటింగ్ కేసు నమోదైంది. గతంలో శేఖర్ రాజు అనే వ్యక్తి దగ్గర వర్మ 56 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఈ విషయంలో డబ్బులు తిరిగి ఇవ్వక పోగా బెదిరింపులకు పాల్పడుతున్నారని శేఖర్ రాజు కోర్టును ఆశ్రయించాడు. అతనిపైన నేడు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు…
బీజేపీ నేత, పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్‌తో సహా మరో వ్యక్తిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. అయితే.. ఆశిష్ గౌడ్ రూ. రెండున్నర కోట్ల రుణం తీసుకొని బ్యాంకు వద్ద మార్టిగేజ్ చేసిన ఫ్లాట్లను వేరొకరికి అమ్ముకొని మోసానికి పాల్పడ్డ బీజేపీ నేత కుమారుడిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. 2018 వ్యాపార కార్యకలపాల కోసం సోమాజిగూడలోని ఎస్బీఐ శాఖ నుంచి రుణం కోసం…
ప్రస్తుతం టాలీవుడ్ లో జీవితా రాజశేఖర్ చీటింగ్ కేసు హాట్ టాపిక్ గా మారింది. ‘గరుడ వేగ’ నిర్మాత, జ్యో స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత కోటేశ్వర రాజు జీవితా పై చీటింగ్ కేసు పెట్టిన విషయం విదితమే. తమ వద్ద రూ. 26 కోట్ల అప్పు తీసుకుని ఎగవేతకు పాల్పడినట్టు ఆయన తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ కేసుపై జీవిత స్పందిస్తూ.. మేము ఎవరికి భయపడమని, కోర్టులోనే చూసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా తమపై కేసు…
బాలీవుడ్ హీరోయిన్ రిమి సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధూమ్ 2, గోల్‌మాల్, బాగ్‌బాన్, హంగామా వంటి సినిమాల్లో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కి కూడా సుపరిచితమే. మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన అందరివాడు చిత్రంలో రిమి సేన్ నటించి తెలుగు ప్రేక్షకులను సైతం మెప్పించింది. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంది. తాను స్నేహితుడని నమ్మిన ఒక వ్యక్తి తనను అడ్డంగా మోసం చేసాడని, కొత్త వ్యాపారం…
టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ మరియు అతని కుమారుడు సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై ఫైనాన్షియర్ శ్రవణ్ పోలీస్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. గోపించంద్ మలినేనితో శ్రీనివాస్ సినిమా ఉంటుందని చెప్పి తనవద్ద రూ.85 లక్షలు తీసుకున్నారని అప్పటి నుంచి డబ్బు తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని శ్రవణ్ గత వారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తనను బెదిరిస్తున్నారని, తనకు ప్రాణ హాని కూడా ఉందని తెలిపాడు. ఇక ఈ కేసుఫై బెల్లంకొండ…
చిత్ర పరిశ్రమ అన్నాకా నిర్మాతలకు, ఫైనాన్షియర్లకు గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఒకరి మీద ఒకరు పోలీస్ కేసులు పెట్టుకుంటూనే ఉంటారు. తాజాగా టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ పై ఒక ఫైనాన్షియర్ పోలీస్ కేసు పెట్టడం ప్రస్తుతం సంచలనంగా మారింది. కేవలం నిర్మాత బెల్లంకొండ సురేష్ పైనే కాకుండా ఆయన కొడుకు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పైన కూడా కేసు పెట్టడం గమనార్హం.. వివరాల్లోకి వెళితే.. బెల్లంకొండ సురేష్.. శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి…
సీనియర్ హీరో నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. భర్త పేరు చెప్పి ఆమె చాలామంది వద్ద డబ్బులు వసూలు చేసినట్లు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఐదుగురు మహిళలు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే సీనియర్ హీరో నరేష్ కి రమ్య రఘుపతితో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే కొన్ని రోజులు కలతలు లేకున్నా సాగిన వీరి కాపురంలో విభేదాలు రావడంతో వీరిద్దరు విడిగా ఉంటున్నారు. విడిగా ఉంటున్న రమ్య…