తమిళ స్టార్ హీరో రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్ పై గత కొన్నేళ్లుగా చెన్నైకి చెందిన యాడ్ ఏజెన్సీ కంపెనీ న్యాయ పోరాటం చేస్తోంది.. ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కించిన కొచ్చాడియాన్ సినిమా ప్రొడక్షన్ సమయంలో .. యాడ్ ఏజెన్సీ కంపెనీ నుంచి తీసుకున్న ఋణం..తిరిగి ఇవ్వకపోవడంపై లతా రజినీకాంత్పై చీటింగ్ కేసు నమోదయ్యింది.. దీంతో ఈ కేసు పై అప్పటి నుంచి విచారణ జరుగుతూనే ఉంది.. దీనిపై పెద్ద చర్చే జరిగింది..
ఇక ఇది కాస్త బెంగళూరులోని 1వ ఏసీఎంఎం కోర్టు వరకు వెళ్లింది. కోర్టులో హాజరయ్యిన లతా రజినీకాంత్కు ఈరోజు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత బాండ్, రూ.25,000 నగదు తో పాటు కొన్ని కండిషన్స్ పై ఆమెకు బెయిల్ మంజూరు చేసింది..లతా రజనీకాంత్ వెంట రజనీకాంత్ స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు ఉన్నారు..
ఇకపోతే ఈ వివాదానికి కారణమెంటంటే.. అప్పటిలో కొచ్చియాడన్ అనే సినిమా కోసం భారీగా ఖర్చు చేశారు..దీంతో ఈ సినిమా నిర్మించిన మీడియా వన్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో పనిచేస్తున్న మురళి అనే వ్యక్తికి.. చెన్నైకి చెందిన యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ. 6.2 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చింది.. మురళికి ఇచ్చిన రుణానికి గ్యారెంటర్‌గా లతా రజనీకాంత్ సంతకం చేశారు.. అతను సరిగ్గా ఇవ్వకపోవడంతో ఈమె పై కేసు నమోదు అయ్యింది.. ఇప్పుడు ఈ కేసు పై ఊరట కలిగింది..