చాట్ బాట్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ప్రతిదీ..కేక్ వాక్ దాదని తేలిపోయింది. అందులోనూ భారత్ ప్రతిష్టాత్మకమైన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్ డ్ ను క్లియర్ చేయడం అంత ఈజీ కాదని నిరూపితమైంది.
Be careful of ChatGPT: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో పనిచేసే చాట్‌జీపీటీ.. అద్భుతాలు చేస్తోందంటూ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. కానీ.. ఈ సరికొత్త సాంకేతికతలో కూడా కొన్ని లోటుపాట్లు బయటపడుతున్నాయి. అడిగిన సమాచారాన్ని లోపాలు లేకుండా ఇవ్వటంలో ఈ చాట్‌బాట్ తడబడుతున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ఇదొక లోపం కాగా.. ఈ కృత్రిమ మేధతో షేర్ చేసుకునే మన పర్సనల్ డేటాకు ప్రైవసీ లేకపోవటం మరో లోపం.
ప్రస్తుతం టెక్ వర్గాల్లో చాట్‌జీపీటీ ఒక సంచలనంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. దీని వాడకంలోని నైతికతపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కాపీరైట్ హక్కుల ఉల్లంఘనలను నిపుణులు తెరపైకి తెస్తున్నారు.
ChatGPT: ప్రపంచ మీడియా చరిత్రలో ఇంతకుముందెన్నడూ.. ఎవరూ.. చూడని ఒక కొత్త యాంకర్ తాజాగా తెర మీదికొచ్చారు. ఆమె పేరు.. చాట్‌జీపీటీ. అదేంటి?.. చాట్‌జీపీటీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో పనిచేసే చాట్‌బాట్ కదా అనుకుంటున్నారా?. అది నిజమే. ఆ కృత్రిమ మేధతో రూపొందించిన పరికరమే ఇప్పుడు యాంకర్‌గా సరికొత్త అవతారమెత్తింది. అంతర్జాతీయ ప్రముఖులిద్దరిని అలవోకగా ఇంటర్వ్యూ చేసేసింది.
Microsoft: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.. మైక్రోసాఫ్ట్ చాట్‌జిపిటి వెనుక ఉన్న ఏఐ సాంకేతికతను పవర్ ప్లాట్‌ఫారమ్ అని పిలవబడే దాని ప్రసిద్ధ సాధనాలతో అనుసంధానించింది. మైక్రోసాఫ్ట్ తన సెర్చ్ ఇంజన్ బింగ్‌తో ఏఐని ఏకీకృతం చేయాలని నిర్ణయించుకున్న వారాల తర్వాత ఇది వస్తుంది. కొత్త డెవలప్మెంట్ పవర్ ప్లాట్‌ఫారమ్ వినియోగదారులను తక్కువ అనుభవం లేదా కోడింగ్ అనుభవం లేకుండా అప్లికేషన్లను అభివృద్ధి చేయడానికి అనుమతిస్తుంది. అంటే.. కోడింగ్‌తో పనిలేకుండా యాప్స్‌ను తయారు…
Business Headlines 27-02-23: ఆర్థిక వృద్ధి ఆశాజనకంగా లేదు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం ఎక్కువగానే ఉంటుందని, ఆర్థిక వృద్ధి మందగిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానెటరీ పాలసీ కమిటీ సభ్యుడు జయంత్ ఆర్ వర్మ అన్నారు. ఆర్థిక వృద్ధి బలహీనంగా ఉండటం వల్ల అంచనాల కన్నా తక్కువగానే నమోదవుతుందని తెలిపారు. వడ్డీ రేట్లు పెరగటం వల్ల ఆ ప్రభావం ఈఎంఐలపై పడి ఫ్యామిలీ బడ్జెట్ తగ్గుతుందని చెప్పారు. చివరికి ఖర్చులు సైతం తగ్గుతున్నాయని పేర్కొన్నారు.
TCS on ChatGPT: ‘చాట్‌జీపీటీ’కి ఇటీవల మంచి ఆదరణ పొందుతుంది.. చాట్‌జీపీటీ వాడేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారట.. కొందరు ఇది ఎలా పని చేస్తుందో తెలుసుకునేందుకే వాడితే.. మరికొందరు బాగుందని వాడేవారు కూడా ఉన్నారు.. అయితే, చాట్‌జీపీటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. చాట్‌జీపీటీ వంటి ప్లాట్‌ఫామ్‌లు.. ఉద్యోగుల స్థానాలను ఆక్రమించబోవని ఐటీ దిగ్గజం టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ పేర్కొన్నారు.. అవి ’కృత్రిమ మేథ (ఏఐ) గల…
ChatGPT : చాట్ జీపీటీ ఇప్పుడు ఈ పేరు హాట్ టాపిక్.. ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఏలుతున్న గూగుల్ తల్లికే గుబులు పుట్టిస్తున్న పిల్ల బ్రౌజర్. దీని రాకే ఓ సంచలనం.