Fake ChatGPT apps: నకిలీ యాప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ యూజర్లను లక్ష్యంగా చేసుకుని ఈ యాప్స్ రూపొందిస్తున్నారు స్కామర్లు. ఇదిలా ఉంటే ప్రస్తుతం టెక్ రంగంలో వినిపిస్తున్న ‘‘ChatGPT’’ పేరుతో సైతం నకిలీ యాప్స్ పుట్టుకొస్తున్నాయి. ప్లేస్టోర్ లో వినియోగదారులను మోసం చేసేందుకు నకిలీ ChatGPT యాప్‌లు రూపొందించారు. వీటిని నిజమైన ChatGPT యాప్స్ అని నమ్మి, ఆండ్రాయిడ్ మొబైళ్లలో డౌన్ లోడ్ చేసుకుంటే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ యాప్స్ ద్వారా మొబైళ్లలో మాల్వేర్ ను ఇన్‌స్టాల్ చేసి డేటాను దొంగిలించే అవకాశం ఉందని, మీ ఫోన్లను హ్యాక్ చేసే అవకాశం ఉంది. స్కామర్లు స్కామ్స్ చేయడానికి, మోసపూరిత కార్యకలాపాల ద్వారా డబ్బు సంపాదించడానికి ఈ నంబర్‌లను ఉపయోగిస్తున్నారు. నిజానికి ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం చాట్‌జిపిటి యాప్ ఇంకా ప్రారంభించబడలేదు.
Read Also: China: చైనాలో కొత్త ట్రెండ్.. వైట్ కాలర్ జాబ్స్ వద్దు, ఫిజికల్ వర్క్ ముద్దంటున్న యువత
పాలో ఆల్టో నెట్‌వర్క్స్ యూనిట్ 42కి చెందిన పరిశోధకులు ఈ మాల్‌వేర్‌ను కనుగొన్నారు. OpenAI GPT-3.5, GPT-4లను విడుదల చేసిన సమయంలోనే ఇది కనిపించడం ప్రారంభించిందని వారు కనుగొన్నారు. ముఖ్యంగా ChatGPTని ఉపయోగించాలనే వినియోగదారుల్ని ఈ మాల్వేర్ టార్గెట్ చేస్తోంది. పరిశోధకులు రెండు రకాల క్రియాశీలక మాల్వేర్లను కనుగొన్నారు. దీంట్లో ఒకదాన్ని మీటర్ ప్రెజర్ ట్రోజన్ గా పిలుస్తారు. ఇది ‘‘SuperGPT’’ అనే పిలువబడే యాప్ లో ఉంది. ఈ మాల్వేర్లు అసలైన ChatGPT యాప్ గా నమ్మిస్తుంది.
ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్(APK) ఫైల్ యాప్స్ ను ఆండ్రాయిడ్ మొబైళ్లలో ఇన్ స్టాల్ చేసేందుకు ఉపయోగించే ఫైల్. హానికరమైన APK అసలైన ChatGPT యాప్ గా కనిపిస్తుంది. వీటిని మొబైళ్లలో ఇన్ స్టాల్ చేస్తే మొత్తం ఫోన్ ని మోసగాళ్లు నియంత్రించే వీలు ఉంటుంది. ఇలాంటి నకిలీ యాప్స్ ChatGPT సంస్థ అయిన OpenAI యొక్క లోగోతో కనిపిస్తూ మోసం చేస్తుంటాయి.