AI Technology: ఆర్థిక మాంద్యం, ఆర్థిక మందగమనం ఇప్పటికే టెక్ కంపెనీలను కుదిపేస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఖర్చులను తగ్గించుకోవాలనే ఉద్దేశంలో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( AI) ఇప్పుడు కొలువులకు ఎసరు పెడుతోంది. ఏఐ టెక్నాలజీ వల్ల టెక్ కంపెనీల్లో పనిచేస్తున్న 4000 మందిని గత నెల మేలో తొలగించారు. వివిధ కారణాల వల్ల గత నెలలో 80,000 మందిని తొలగించారు.
Read Also: Medicine Banned: 14 రకాల మందుల ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్లను నిషేధించిన ప్రభుత్వం
గత రెండు నెలలుగా టెక్ జాబ్ మార్కెట్ చాలా అస్థిరంగా ఉంది. చాట్ జీపీటీ, బింగ్, బార్డ్ వంటి ఏఐ టెక్నాలజీ వంటివి ఇప్పుడు టెక్ ఉద్యోగులకు తలనొప్పిగా మారాయి. OpenAI నవంబర్ 2022లో ChatGPTని పరిచయం చేసింది. గూగుల్, మైక్రోసాఫ్ట్ లు తమ కొత్త ఏఐ టూల్స్ బార్డ్, బింగ్ వంటి వాటిని ఫిబ్రవరిలో ప్రారంభించాయి. ఈ మూడు ఏఐ టూల్స్ టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. మరికొన్ని కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పనిచేస్తున్నాయి.
గత నెలలో 80,000 మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఒక్క ఏఐ వల్లనే ఏకంగా 3900 మంది తమ ఉద్యోగాల నుంచి తొలగించబడ్డారు. ఉద్యోగుల కోత, ఆర్థిక పరస్థితులు, ఖర్చుల తగ్గింపు, కంపెనీల పునర్నిర్మాణం కారణంగా ఉద్యోగుల కోతలు జరిగాయని బిజినెస్ ఇన్ సైడర్ నివేదిక వెల్లడించింది. జనవరి నుంచి మే వరకు దాదాపు 4 లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగ సలహా వేదిక Resumebuilder.com నిర్వహించిన మరో సర్వేలో కొన్ని యూఎస్ ఆధారిత కంపెనీలు ఉద్యోగుల స్థానాల్లో చాట్ జీపీటిని అమలు చేస్తున్నాయని తెలిపింది.