AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) చుట్టూనే ప్రస్తుతం టెక్ ప్రపంచం తిరుగుతోంది. గూగుల్ తో సహా పలు కంపెనీలు ఏఐని అభివృద్ధి చేస్తున్నాయి. రానున్న కాలంలో AI టెక్నాలజీ శాసిస్తుందని చెబుతున్నారు. ఇది ప్రపంచ మానవాళి జీవితాన్ని మరింత సులభంగా మారుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంేట దీని వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో..లోపాలు అంతకన్నా ఎక్కువగా ఉంటాయని చాలా మంది అగ్రశ్రేణి టెక్ సీఈఓలు నమ్ముతున్నారు. ట్విట్టర్, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ఈ దిశగా హెచ్చరికలు చేశారు. ఈ వారం ప్రారంభంలోని యేల్ సీఈఓ సమ్మిట్ లో సీఎన్ఎన్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. 42 శాతం సీఈఓలు కృత్రిమ మేథ వలన రాబోయే కొన్ని ఏళ్లలో మానవాళిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని నమ్ముతున్నారు.
Read Also: LGM Movie: రిలీజ్‌కి సిద్ధమవుతోన్న ధోని ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ ‘LGM’
దాదాపుగా 42 శాతం సీఈఓలు, అగ్రశ్రేణి వ్యాపార దిగ్గజాలు ఐదు పదేళ్లలో ఏఐ నుంచి మానవాళికి తీవ్ర ప్రమాదం ఉందని, మానవాళిని నాశనం చేసే సామర్థ్యం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సర్వేలో వాల్‌మార్ట్, కోకా-కోలా, జిరాక్స్, జూమ్ వంటి వ్యాపార సంస్థల సీఈఓలు 119 మంది పాల్గొన్నారు. నివేదిక ప్రకారం దాదాపు 34 శాతం మంది సీఈఓలు AI పదేళ్లలో మానవాళిని నాశనం చేయగలదని చెప్పగా, వారిలో 8 శాతం మంది కేవలం ఐదేళ్లలో విధ్వంసం జరగవచ్చని చెప్పారు. 58 శాతం మంది సీఈఓలు మాత్రం ఏఐ ఎప్పటికీ మానవుడికి ప్రమాదం కాదని, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఎలాన్ మస్క్ తో పాటు OpenAI వ్యవస్థాపకుడు కూడా ఏఐ ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నారు. కొన్ని వారాల క్రితం ఏఐ పరిశ్రమలకు సంబంధించిన నాయకకులు, మరికొందరు టెక్ కంపెనీ సీఈఓలు ఏఐ ప్రమాదం గురించి హెచ్చరించే ప్రకటనపై సంతకం చేశారు. దీని తర్వాత తాజా నివేదిక వెలుగులోకి వచ్చింది. సంతకాలు చేసిన వారిలో ChatGPT సృష్టికర్త సామ్ ఆల్ట్‌మాన్, జియోఫ్రి హింటన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన టెక్ దిగ్గజాలు ఉన్నారు.