TSPSC: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రశ్నపత్రం లీక్ కేసు దేశంలోనే సంచలనం సృష్టించింది. ఈ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. లీకేజీకి పాల్పడిన వారు వ్యవస్థను మోసం చేయడానికి ChatGPTని ఉపయోగించారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE), డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (DAO) రిక్రూట్‌మెంట్ కోసం ప్రశ్నపత్రాలను కాపీ చేసిన తర్వాత నిందితులలో ఒకరు సమాధానాలు పొందడానికి AI సాంకేతికతను ఉపయోగించినట్లు లీక్‌పై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కనుగొంది. ముగ్గురు అభ్యర్థులు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లతో పరీక్షా కేంద్రంలోకి రాగా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఓ వ్యక్తి సమాధానాలను గుర్తించి పంపిణీ చేసినట్లు గుర్తించారు.
Read Also:India’s Defence Exports: ఇది భారత్ సత్తా.. ఆల్‌టైం హైకి రక్షణ ఎగుమతులు..
పెద్దపల్లిలో తెలంగాణ స్టేట్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌లో డివిజనల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న పూల రమేష్ (35)ను సిట్ పట్టుకోవడంతో ఈ సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి. రమేష్ కనీసం మూడు పరీక్షల లీక్ అయిన ప్రశ్న పత్రాలను కాపీ చేశాడు. వాటిలో రెండింటికి సమాధానాలు పొందడానికి ChatGPTని ఉపయోగించాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం జనవరి 22, ఫిబ్రవరి 26న నిర్వహించిన రెండు పరీక్షలకు హాజరైన ఏడుగురు అభ్యర్థులకు సమాధానాలు అందించడానికి రమేష్ భారీ ప్లానే వేశాడు. మొత్తం ఏడుగురు బ్లూటూత్ మైక్రో ఇయర్‌పీస్‌లను వారి చెవిలో పెట్టుకుని పరీక్ష హాల్కు హాజరయ్యారు. పరీక్ష ప్రారంభమైన 10 నిమిషాల తర్వాత పరీక్షా కేంద్రంలోని ఎగ్జామినర్ ప్రశ్నపత్రాల ఫోటోలను తీసి రమేష్‌కు పంపినట్లు భావిస్తున్నారు.
Read Also:Merugu Nagarjuna: మేనిఫెస్టోని అమలు చేసిన ఘనత జగన్‌ది.. చంద్రబాబులా మాయం చేయలేదు
మరో ప్రదేశంలో తన నలుగురు సహచరులతో కూర్చున్న రమేష్, సరైన సమాధానాలను పొందడానికి చాట్‌జిపిటిని ఉపయోగించాడు. వాటిని అభ్యర్థులకు ట్రాన్స్ ఫర్ చేశాడు. ఏడుగురిలో ఒక్కొక్కరు ఉత్తీర్ణత సాధించేందుకు రూ.40 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారని ఆరోపించారు. అయితే, మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) పరీక్షకు రమేశ్‌కు చాట్‌జీపీటీ ఉపయోగించాల్సిన అవసరం రాలేదు. అంతకు ముందే లీకైన ప్రశ్నపత్రం పూల రవికిషోర్ నుండి ముందుగానే అందింది. లీక్ అయిన ప్రశ్నపత్రాన్ని రమేష్ 30 మందికి పైగా అభ్యర్థులకు ఒక్కొక్కరికి 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయలకు విక్రయించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులతో సహా 35 మందికి పైగా అభ్యర్థుల నుండి 10 కోట్లు సంపాదించాలని రమేష్ ఆశించాడు. మార్చి ప్రారంభంలో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చే సమయానికి అతను దాదాపు రూ.1.1 కోట్లు అందుకున్నాడు. ఆయనను మంగళవారం అరెస్టు చేశారు.