ChatGPT : ప్రస్తుత యుగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కాలం నడుస్తోంది. చాట్ జీపీటీ(ChatGPT) రాకతోనే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చాట్‌జీపీటీ వచ్చాక పలు అంతర్జాతీయ సంస్థలు ఉలిక్కిపడుతున్నాయి. కేవలం ఐదు రోజుల్లో వన్ మిలియన్ వినియోగదారులను సంపాదించుకుని రికార్డు నెలకొల్పింది. ప్రతి ఒక్కరూ వారి ప్రశ్నలకు సమాధానమివ్వమని ChatGPTని అడుగుతున్నారు. అయితే ఈ చాట్‌జీపీటీ వల్ల ఇంట్లో మనస్పర్థలు వస్తాయని ఎవరూ ఊహించి ఉండరు. అలాంటి ఘటనే హాంకాంగ్ నుంచి వెలుగులోకి వచ్చింది. ఒక భర్త తన పుట్టబోయే బిడ్డకు పేరు పెట్టడానికి చాట జీపీటీ సహాయం తీసుకున్నాడు. కానీ అలా చేయడం వల్ల అతని భార్యకు విపరీతమైన కోపం వచ్చింది.
Read Also: Today Business Headlines 12-04-23: అప్పుల కోసం.. ఆస్తుల అమ్మకం. మరిన్ని వార్తలు
హాంకాంగుకు చెందిన ఓ జంట త్వరలో బిడ్డను ఆశిస్తున్నారు. అందుకు భార్య కాబోయే బిడ్డకు మంచి పేరు సూచించాలని తన భర్తను కోరింది. కానీ సోమరి అయిన ఆ భర్త ఆ బిడ్డకు మంచి పేరు పెట్టడానికి ChatGPTని ఉపయోగించాడు. అయితే ఈ విషయం అతని భార్యకు తెలియడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె తన భర్తపై చాలా కోపగించుకుంది. పాపకు తండ్రి ఎవరు, మీరా లేదా ChatGPT నా అంటూ ప్రశ్నించింది. ఈ ఘటనపై స్వయంగా మహిళ ఓ వేదికపై మాట్లాడింది. మార్చి చివరలో సామాజిక మాధ్యమాల్లో ఈ వ్యవహారం అంతా పోస్ట్ చేసింది. ఆమె ఆ రకంగా పోస్ట్ చేసింది.. “మా బిడ్డకు పేరు పెట్టడంలో మాకు సహాయం చేయమని నేను నా భర్తను అడిగాను, కానీ అతను ChatGPT నుండి సహాయం తీసుకున్నాడు.”
Read Also: CM KCR: కారేపల్లి అగ్నిప్రమాద ఘటన.. సీఎం కేసీఆర్ ఏమన్నారంటే..
త్వరలో పుట్టబోయే తన బిడ్డకు చైనీస్ పేరును కనుగొనడానికి అతను ChatGPT సహాయం కోరాడు. దీని తర్వాత చాట్‌జిపిటి అతనికి చాలా పేర్లను సూచించింది. అయితే భర్తకు వాటిలో ఏవీ నచ్చలేదు. కాబట్టి అతను వేరే వేరే పేరును సూచించమని ChatGPTని కోరాడు. దీని తర్వాత chatgpt సూచించిన పేరు భర్తకు నచ్చింది. వాటిలో ఒకదానిని ఎన్నుకోమని అతను తన భార్యను కోరాడు. కానీ భార్యకు ఈ పేర్లేవీ నచ్చలేదు. అప్పుడే ఆమె పై రకంగా భర్తకు చేదు ప్రశ్న వేసింది. ఇదంతా ఆ మహిళ తన పోస్ట్‌లో ఘటనను ప్రస్తావించింది.